CM Chandrababu Tweet on Police Handed Over Scooter to Woman in Eluru:దొంగల నుంచి ఏలూరు పోలీసులు భారీఎత్తున బైక్‌లు రికవర్ చేయడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. తలసేమియా బాధిత కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వాడుకునే స్కూటర్ చోరీ కావడంతో నీలి అలివేణి అనే మహిళ తీవ్ర ఆవేదనకు గురయ్యారని చెప్పారు. బైక్‌ను పోలీసులు తిరిగి అప్పగించడంతో ఆనందంతో ఆమె ఉద్వేగానికి లోనుకావడం తనను కదిలించిందన్నారు. అలివేణి వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. రోజువారీ రవాణా, జీవనోపాధికి వాడే వాహనాలు చోరీ అయితే బాధిత కుటుంబాలు ఎంత బాధ పడతాయో ఈ ఘటన తెలియజేస్తోందన్నారు.
ఈ ట్వీట్ కు బాధితురాలు నీల అలివేణి భావోద్వేగ వీడియో నూ సీఎం జత చేశారు. 251 దొంగిలించిన బైక్‌లను స్వాధీనం చేసుకుని, 25 మంది అనుమానితులను అరెస్టు చేయటం సంతోషకరమని సీఎం చంద్రబాబు కొనియడారు. ఈ కేసులను ఛేదించి బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి సరికొత్త సాంకేతికతను ఉపయోగించడం హర్షనియమని కొనియడారు. సత్వర చర్యలతో ప్రజలకు సేవ చేసిన ఏలూరు పోలీసులను చంద్రబాబు అభినందించారు.