ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అసాంఘిక శక్తులకు చంద్రబాబు హెచ్చరిక- మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు - CM Serious on Crime Against Women

CM Chandrababu Serious Towards Crime Against Women: ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదంటూ అసాంఘిక శక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి హెచ్చరిక చేశారు. చీరాల మండలంలో జరిగిన మహిళ హత్యాచార ఘటనను సీఎం స్వయంగా పర్యవేక్షించారు. బాధిత కుటుంబానికి సత్వరమే పరిహారం అందేలా చూశారు. 48గంటల్లో నిందితుల్ని పట్టుకునేలా పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు.

CM_Chandrababu_Serious_Towards_Crime_Against_Women
CM_Chandrababu_Serious_Towards_Crime_Against_Women (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 1:56 PM IST

అసాంఘిక శక్తులకు చంద్రబాబు హెచ్చరిక- మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు (ETV Bharat)

CM Chandrababu Serious Towards Crime Against Women: బాపట్ల జిల్లా చీరాల మండలంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై దుండగులు అత్యాచారం చేసి హతమార్చిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన తన దృష్టికి రాగానే ముఖ్యమంత్రి వేగంగా స్పందించారు. హోంమంత్రి అనితను తక్షణమే ఘటనాస్థలానికి వెళ్లి దగ్గరుండి విచారణ జరిపించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హోంమంత్రి ఘటనాస్థలానికి వెళ్లారు.

ఇదే సమయంలో నిందితులు తప్పించుకోవడానికి వీల్లేకుండా అధికారులతో మాట్లాడి పర్యవేక్షించాలని జిల్లాకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికి సీఎం చంద్రబాబు సూచించారు. మరోవైపు నూతన డీజీపీగా బాధ్యతలు తీసుకుని తనని కలవడానికి వచ్చిన ద్వారకా తిరుమలరావుతోనూ మహిళ హత్యాచార ఘటనపై సీఎం మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

అశ్లీల వీడియోలకు అలవాటై కుమార్తెపై కన్నేసిన తండ్రి- దారుణంగా హతమార్చిన వైనం - Father Killed Daughter

ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు. సీఎం ఆదేశాల మేరకు ఘటనాస్థలానికి వెళ్లిన హోంమంత్రి అనిత పది ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల తక్షణ ఆర్థిక పరిహారం అందేలా ఏర్పాట్లు చేశారు.

కేసును స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తుండటంతో అధికారుల్లో వేగంగా కదిలిక వచ్చింది. హత్య జరిగిన 48 గంటల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం ఉంటేనే నేరాలను కట్టడి చేయవచ్చని డీజీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గంజాయి, మాదకద్రవ్యాల మత్తులో జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు.

కాగా, ఈ కేసును బాపట్ల జిల్లా పోలీసులు 48గంటల్లో చేధించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితులు ఈపురుపాలెం గ్రామానికి చెందిన దేవరకొండ విజయ్, శ్రీకాంత్‌, కారంకి మహేశ్​​ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. త్వరలోనే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని తెలిపారు.

భార్యపై అనుమానంతో కుమార్తెను పొట్టనపెట్టుకున్న కసాయి - FATHER KILLED HIS DAUGHTER

ABOUT THE AUTHOR

...view details