CM Chandrababu Review On Capital :రాజధానిలో త్వరితగతిన జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 90 రోజుల్లో సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సిటీగా అమరావతి రాజధానిని రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, అమరావతిని కలిపి ఆంగ్లంలో లోగోను రూపొందించాలని సూచించారు. అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించి, నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ పడకూడదని తెలిపారు.
మెట్రో రైలు ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టాలి : హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపైనా చంద్రబాబు సమీక్షించారు. హ్యాపీనెస్ట్ ప్లాట్లన్నీ అప్పట్లో ఒక్క గంటలో అమ్ముడు పోయాయని గుర్తు చేశారు. హ్యాపీనెస్ట్లో గత ప్రభుత్వం చర్యల కారణంగా వచ్చిన నష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులపై సీఎం సమీక్ష చేశారు. జంగిల్ క్లియరెన్స్ కోసం 190 ప్రొక్లెయినర్లు ముళ్ళ చెట్లను తొలగిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికీ దాదాపు 60 శాతం జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాజధానిలో ముగిసిన ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బృందం పర్యటన - అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహకారం!
Narayana on Happy Next Project :సీఆర్డీఏ కార్యాలయాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి నారాయణ తెలపారు. గత ప్రభుత్వం హ్యాపీనెస్ట్‌ను పూర్తిగా వదిలేసిందని ఆరోపించారు. రూ.700 కోట్లతో గతంలో హ్యాపీనెస్ట్‌ను ప్రతిపాదించామని, ప్రస్తుతం హ్యాపీనెస్ట్ పూర్తి కావాలంటే రూ.930 కోట్లు కావాలని అన్నారు. గంటలోనే హ్యాపీనెస్ట్‌లోని ప్లాట్లు అన్నీ బుక్ అయ్యాయని, ప్రాజెక్టుకు సీఎం క్లియరెన్స్ ఇచ్చారని తెలిపారు.