CM Chandrababu Thanks to Officers: వరద సాయం కార్యక్రమంలో భాగస్వాములు అయిన వారితో సోమవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. వరద సాయంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి పనిచేసిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలకు ధన్యవాదాలు తెలుపనున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజల అకౌంట్లకు పరిహారం సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.
ఆస్తి, పంట నష్టం కింద 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయల పరిహారం చెల్లింపునకు ప్రభుత్వ నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రజల అకౌంట్లలో 569 కోట్లు జమ అయిన్నట్లు అధికారులు తెలిపారు. బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్‌గా లేకపోవడం వంటి కారణాలతో పరిహారం పెండింగ్‌లో ఉన్నవారికి సోమవారం నాటికి చెల్లింపులు పూర్తికానున్నాయి. దాదాపు మూడున్నర వేల మందికి బౌన్స్ అయ్యి డబ్బులు వెనక్కి వచ్చాయి.
ఇందుకు కారణం బాధితులు ఇచ్చిన బ్యాంక్ ఖాతాలు యాక్టివ్‌లో లేవని తేలింది. వాడుకలో ఉన్న బ్యాంక్ ఖాతాలు వారు అందచేస్తే వెంటనే పరిహారం పడేలా ముఖ్యమంత్రి కార్యాలయం బాధ్యత తీసుకుంది. ప్రభుత్వమే అందరికీ ఫోన్లు చేసి మరీ వాడుకలో ఉన్న బ్యాంకు ఖాతాలు ఇమ్మని ఇప్పటికే అడుగుతోంది. రేపటికి అన్ని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సీఎం యోచిస్తున్నారు.
వరద సహాయక చర్యలపై కేంద్రం ప్రశంసలు - బాధితులకు ఉచితంగా సర్టిఫికెట్లు - RP Sisodia on AP Floods
వరద విపత్తు సమయంలో సీఎం చంద్రబాబు పాలనా దక్షత బహిర్గతమైందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వరద బాధితులకు యావత్తు ప్రభుత్వ యంత్రాంగాన్ని బాసటగా నిలిచేలా చేశారని ప్రశంసించారు. విపత్తు జరిగిన 12 రోజుల్లోనే ఆఖరి బాధితుడికి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి మనోహర్ తెలిపారు. విజయవాడ నోవోటెల్ హోటల్‌లో వరుణ్ గ్రూప్ వరద బాధిత ఉద్యోగులకు కోటి రూపాయల చెక్కులను అందజేశారు.
ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ ముంపు పోయేంత వరకు చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే ఉండి సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులకు భరోసాగా నిలిచారన్నారు. మొదటి అంతస్తులో బాధితులకు పాతిక వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వడం చరిత్రలో మొదటిసారని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఒకే రోజు 36 సెంటీమీటర్ల వర్షం విజయవాడలో కురిసిందని, 2014లో అప్పటి సీఎం చంద్రబాబు చొరవతో 60 శాతం కృష్ణా రక్షణ గోడ కట్టడంతో కృష్ణ లంకకు ముంపు తప్పిందన్నారు.
విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ వరుణ్ గ్రూపు స్ఫూర్తితో ముంపుతో అవస్థలు పడిన పోలీసులు, హోంగార్డుల కుటుంబాలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వరణ్ గ్రూపు సంస్థల ఛైర్మన్ ప్రభుకిషోర్ మాట్లాడుతూ తమ ఉద్యోగులకు కష్టకాలంలో సంస్థ ఎప్పుడూ తోడుగా ఉంటుందన్నారు.
"లులు" ఈజ్ బ్యాక్ - ఆ మూడు నగరాల్లో భారీగా పెట్టుబడులపై సీఎంతో చర్చ - Lulu Investments in AP