CM Chandrababu On Khel Ratna Awards: దేశ ప్రతిష్టను పెంచిన నలుగురు క్రీడాకారులను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయడం హర్షణీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎయిర్ గన్ షూటింగ్లో ఒలింపిక్స్ పతక విజేత మను బాకర్, భారతీయ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్, హాకీలో ఒలింపిక్ పతక విజేత టీమ్ సభ్యుడు హాకీ క్రీడాకారుడు హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ పతక విజేత ప్రవీణ్ కుమార్‌లను ఈ సందర్భంగా అభినందించారు.
చదరంగంలో బాల్యం నుంచే ప్రతిభ కనబరుస్తూ, చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయిన గుకేశ్ 2024 చెస్ టోర్నమెంట్లో విశ్వ విజేతగా నిలిచిన విషయం మనకు తెలిసిందే. ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డును అందుకుంటున్న గుకేశ్, తన ప్రతిభతో మరింతగా రాణించాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే అర్జున అవార్డ్ గ్రహీతలు విశాఖకు చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ, వరంగల్‌కు చెందిన పారా అథ్లెట్ జీవన్‌జీ దీప్తికి అభినందనలు తెలిపారు.