CM Chandrababu meets Global CEOs in Davos:సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజూ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌ని కలిసిన సీఎం విశాఖలో డిజైన్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని కోరారు. గూగుల్ క్లౌడ్ సర్వర్ సప్లై చైన్ అనుసంధానించేలా తయారీ యూనిట్‌ని ఏపీలో నెలకొల్పాని సూచించారు. సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని దానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
క్లౌడ్ ప్రొవైడర్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద సంస్థ అయిన గూగుల్ క్లౌడ్ ఇప్పటికే దిల్లీ, ముంబైలో రెండు క్లౌడ్ రీజియన్లు ఏర్పాటు చేసింది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల ఎంవోయూ కుదుర్చుకుంది. ఏఐ వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంపొందించేందుకు ఏపీతో ఒప్పందం చేసుకుంది.
కాకినాడ జిల్లాలో 15 వేల కోట్ల పెట్టుబడి: పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ తౌఫిక్‌తో సీఎం భేటీ అయ్యారు. మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ పెట్రోనాస్ ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మాలిక్యూలస్‌కు సంబంధించి భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 2030 కల్లా ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో 13 వేల కోట్ల నుంచి 15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. పెట్రో కెమికల్ హబ్‌గా అవతరిస్తున్న మూలపేటలో, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లోనూ పెట్టుబడులు పెట్టాలని మహమ్మద్ తౌఫిక్‌ని సీఎం ఆహ్వానించారు.
దావోస్‌లో బిజీబిజీగా మంత్రి లోకేశ్ - పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు