ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్లెప్రగతి పనుల్లో జాప్యంపై సీఎం ఆగ్రహం - ఆ చిన్నారులకు పింఛన్ ఇవ్వాలని ఆదేశాలు - CHANDRABABU IN COLLECTORS MEET

రెండో రోజు కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ప్రజెంటేషన్

Collectors_Conference
Collectors Conference Day 2 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2024, 12:29 PM IST

Collectors Conference Day 2 on Pensions and MGNREGA: రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణపేదరిక నిర్మూలన శాఖలపై ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పెన్షన్లు అర్హత లేనివారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించారు. నిర్వహించిన సర్వేలో ప్రతీ పదివేలకూ 500 మంది వరకూ అనర్హులని తేలినట్టు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు 6 లక్షల మందికి హడావుడిగా పెన్షన్లు ఇచ్చారన్నారు. ఇందులో చాలా మంది అనర్హులే ఉన్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

వచ్చే మూడు నెలల్లోగా ప్రతీ పెన్షన్​ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం డిమాండ్​కు అనుగుణంగా నిర్వహించాల్సిన కార్యక్రమం అని సీఎం అన్నారు. వంద రోజులు పనిదినాలను సరిగా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. పని దినాలు, మెటీరియల్ కాంపోనెంట్​ను పూర్తి చేయలేక పోతున్నారని సీఎం వాఖ్యానించారు. పల్లె పండుగలో 14.8 % మాత్రమే పనులు చేశారని, ఇంకా నెలన్నర సమయం మాత్రమే ఉందని సీఎం అన్నారు.

రేషన్ బియ్యం అక్రమాలు జరిగేందుకు వీల్లేదు - సీఎం చంద్రబాబు హెచ్చరిక

అల్లూరి జిల్లాలో 54 శాతం పూర్తైతే, మరో జిల్లాలో 1.6 శాతం మాత్రమే పనులు జరగటంపై సీఎం ప్రశ్నించారు. పని పూర్తైన వెంటనే బిల్లులు ఎందుకు చెల్లించటం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కలెక్టర్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ల వద్ద ఉపాధి హామీ డబ్బులు ఉన్నా బిల్లులు ఎందుకు చెల్లించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలజీవన్ మిషన్​ను గత ప్రభుత్వం మొత్తం దెబ్బ తీసిందని సీఎం అన్నారు.

దివ్యాంగులు రూ.15 వేలు అడుగుతున్నారు:గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించామని సీఎం తెలిపారు. గ్రామాల్లో కనీసమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని ముఖ్యమంత్రి ఆదేశించారు. తల్లిదండ్రులు చనిపోయి చిన్నారులు ఉంటే వారికీ పెన్షన్ ఇవ్వాలని సీఎం సూచించారు. దివ్యాంగులు చాలా మంది 15 వేల రూపాయలు అడుగుతున్నారని కలెక్టర్లు తెలిపారు. సదరు ధ్రువీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలని సీఎం ఆదేశించారు.

వాట్సప్ ద్వారా 153 సేవలు - సమాచారమంతా ఒకే వెబ్‌సైట్​లో

Chandrababu on Amaravati Action Plan: రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందే నగరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ - గుంటూరు వంటి సిటీలు అమరావతిలో కలిసిపోతాయని, దానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అర్బనైజేషన్ పెరుగుతున్న దృష్ట్యా నిరంతరాయంగా అవుటర్ రింగ్ రోడ్ వెలుపల మాస్టర్ ప్లాన్​ను సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖను ఆదేశించారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా పచ్చదనం అనే కాన్సెప్టును ప్రజల్లో పెంచేలా చూడాలని వెల్లడించారు. స్వచ్ఛత, శుభ్రత అనే అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

ఆచారాలు సంప్రదాయాల తరహాలోనే పరిసరాలు శుభ్రంగా ఉండాలన్న అలవాటుగా మార్చాలని తెలిపారు. గత ప్రభుత్వం 82 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వదిలి వెళ్లిందని, దాన్ని తొలగించే పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యర్థాలను వేస్ట్ టు ఎనర్జీ అనే విధానంలో వినియోగించాలని, పంట వ్యర్ధాలు, నిర్మాణ వ్యర్ధాలు, ఎలక్ట్రానిక్స్, మెటల్, ప్లాస్టిక్ ఇలా వేర్వేరు వ్యర్ధాలను నిర్వహించే విధానం తయారు చేయాలని స్పష్టం చేశారు. రీసైకిలింగ్ విషయంలో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కూడా పనిచేస్తోందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. సర్క్యులర్ ఎకానమీలో వీటిని భాగం చేయాలని, దీనిపై స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాల్సిందిగా సీఎం సూచించారు.

ప్రపంచస్థాయి వసతులతో ఏపీ మారిటైమ్ పాలసీ - ప్రపంచంలోని 20 భారీ పోర్టుల్లో ఒకటి ఇక్కడే

ABOUT THE AUTHOR

...view details