CM Chandrababu held Review Meeting on Free Sand Scheme : ఉచిత ఇసుక అక్రమాలపై సామాన్యులు సైతం ఫిర్యాదు చేసేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపు అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేయాలన్నారు. ఉచిత ఇసుక విధానంపై సచివాలయంలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగాఉచిత ఇసుకపై అధికారులకు సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుకను ఉచితంగా అందించడమే లక్ష్యంగా సీనరేజీ రద్దు చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు.
స్టాక్ యార్డుల ద్వారా సరఫరా : సొంత అవసరాలకు గ్రామ పంచాయతీల పరిధిలో మాత్రమే ట్రాక్టర్లతో ఇసుక తరలింపునకు అనుమతి ఇస్తున్నామన్నారు. అదేవిధంగా ఇసుకను తీసుకెళ్లే వ్యక్తులు గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేయించాలని సూచించారు. ఇసుక కొరత తీర్చేలా రీచ్ లలో తవ్వకాలు, లోడింగ్ ప్రక్రియ ప్రైవేటుకు అప్పగించే అంశంపై ఆలోచన చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని జిల్లా స్థాయి శాండ్ కమిటీ పారదర్శకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇసుక అందుబాటులో లేని జిల్లాల్లో స్టాక్ యార్డుల ద్వారా సరఫరా చేయాలని తెలిపారు.
'ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా తీసుకుపోవచ్చు - సీనరేజ్ వసూళ్లు ఎత్తివేత' - ఇసుక పాలసీలో కీలక మార్పులు ఇవే
సామాన్యులు కూడా ఫిర్యాదు చేసేలా : అలాగే ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపును అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, సీసీటీవీ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఉచిత ఇసుక పాలసీని ఎవరైనా ఎక్కడైనా దుర్వినియోగం చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై సామాన్యులు కూడా ఫిర్యాదు చేసేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇసుక తవ్వకాలకు గైడ్ లైన్స్ : ఉచిత ఇసుకకు సంబంధించి ప్రభుత్వం కొద్దిరోజుల కిందటే కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుకపై సీనరేజ్ వసూళ్లను సైతం ఎత్తివేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. లారీల్లో 40 టన్నులకు మించి ఉన్నా అధిక లోడ్ జరిమానాలు ఉండవని తెలిపారు. ఉచిత ఇసుకపై టీడీపీ ప్రజాప్రతినిధుల భేటీలో ఈ మేరకు సీఎం కీలక ప్రకటన చేశారు. అలాగే పట్టా భూముల్లో కూడా ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పట్టా భూములతో పాటు, డీకేటీ పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. పట్టా, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన గైడ్ లైన్స్‌ను జారీ చేస్తూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే.
అందుబాటులోకి 108 కొత్త ఇసుక రీచ్‌లు! - ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు : మంత్రి కొల్లు
గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి రిమాండ్ - విజయవాడ జైలుకు తరలింపు - MINES DEPT VENKAT REDDY remand