ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

48గంటల్లో నెరవేరిన చంద్రబాబు హామీ- ఆటో డ్రైవర్ కుటుంబంలో ఆనందోత్సాహాలు - CM Chandrababu Helped Auto Driver - CM CHANDRABABU HELPED AUTO DRIVER

CM Chandrababu Completes Promise by Giving Electric Auto to Auto Driver : సీఎం చంద్రబాబు మాట ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తారని ప్రజల్లో ఉన్న నమ్మకం మరోసారి ఆచరణలో నిరూపితమైంది. ఆగస్టు 15న అన్నక్యాంటీన్​ ప్రారంభోత్సవం సందర్భంగా ఎలక్ట్రిక్​ ఆటో ఇస్తానని ఆటోవాలాకు సీఎం హామీ ఇచ్చారు. దాన్ని రెండ్రోజుల్లోనే నెరవేర్చి పాలనలో వేగాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపారు

CM CHANDRABABU PROMISE FULFILLED
CM CHANDRABABU PROMISE FULFILLED (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 18, 2024, 11:28 AM IST

CM Chandrababu Completes Promise by Giving Electric Auto to Auto Driver : సీఎం చంద్రబాబుకు ఏ పనైనా ఆఘమేఘాల మీద చేయడం అలవాటు! గుడివాడలో ఓ ఆటో డ్రైవర్‌కు ఇచ్చిన మాటను రెండ్రోజుల్లోనే నెరవేర్చి పాలనలో వేగాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపారు. చంద్రబాబు వేగానికి ఆటోవాలా అబ్బురపడ్డారు.

గుడివాడలో సీఎం చంద్రబాబు, ఆటోడ్రైవర్‌ రజనీకాంత్‌ మధ్య ఆగస్టు 15న జరిగిన సంభాషణ. అన్నక్యాంటీన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానికులతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు కృష్ణా జిల్లా వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రేమల్లి రజనీకాంత్‌తో మాట్లాడారు. ఆయన కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆటో నిర్వహణ గురించీ ఆరా తీశారు! ఆ క్రమంలో రజినీకాంత్‌కు ఎలక్ట్రిక్ ఆటో సమకూరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

'పేదవాళ్లకు తిండి పెట్టడం కనీస బాధ్యత' - అన్న క్యాంటీన్‌కు విరాళాలివ్వాలని చంద్రబాబు పిలుపు - Anna Canteen Inauguration Program

అలా సీఎం హామీ ఇచ్చారో లేదో ఆగస్టు 17 కల్లా రజనీకాంత్‌ ఇంటి ముందు ఎలక్ట్రిక్‌ ఆటో ప్రత్యక్షమైంది. సీఎం హామీ అమలుపై కలెక్టర్‌ డీకే బాలాజీ ఆగమేఘాలపై కదిలారు. 3.90 లక్షలు విలువైన "అవే ఈసిటీ "ఎలక్ట్రిక్ ఆటో తెప్పించారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ద్వారా రజినీకాంత్‌కు ఆటో తాళాలు అందజేశారు.

ఎలక్ట్రిక్‌ ఆటోను చూసి రజనీకాంత్‌ మురిసిపోయారు. చంద్రబాబు పాలనా వేగం గురించి అందరూ చెప్తుంటే విన్నానని, తాను స్వయంగా చూశానని సంబరపడుతున్నారు. సీఎం చేసిన మేలును తమ కుటుంబం ఎప్పుడూ మరచిపోదని రజనీకాంత్‌ చెప్పారు.

గుడివాడలో 'అన్న క్యాంటీన్‌' పునః ప్రారంభం - పేదలతో కలిసి సీఎం చంద్రబాబు దంపతుల భోజనం - CM CBN Inaugurated Anna Canteen

నేను డీజిల్​ ఆటోను తోలే వాడిని. సీఎం చంద్రబాబు మొన్న వచ్చినప్పుడు డీసీల్​ ఆటోను ఎలక్ట్రిక్​ ఆటోగా మార్చే పద్ధతి గురించి నన్ను అడిగాడు. దానిపై నాకు ఎలాంటి అవగాహన లేదు. కలెక్టర్​ను పిలిచి అడిగితే.. అది మన రాష్ట్రంలో లేదని చెప్పారు. డీజిల్ ​ ఆటో బదులు ఎలక్ట్రిక్​ ఆటో ఇవ్వడానికి ప్రధాన కారణం.. డీసీల్​ ఖర్చును తగ్గించుకోవడానికి. ఇందుకు నెలకు రూ.4000 నుంచి రూ.5000 వరకు మెయింటన్స్ ఖర్చు వస్తుంది. నేను మామూలుగా ఫీల్​ అవ్వడం లేదు. రాష్ట్రంలో ఎవరికీ దక్కని అదృష్టం నాకు దక్కింది -రజనీకాంత్ , ఆటో డ్రైవర్

స్వర్ణాంధ్రప్రదేశ్‌-2047 కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌- కో ఛైర్మన్​గా చంద్రశేఖరన్: చంద్రబాబు - Tata Group Chairman Met CM Cbn

ABOUT THE AUTHOR

...view details