CM Chandra Babu and Minister Lokesh Meet Bill Gates:దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ పెట్టడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని బిల్‌గేట్స్‌కు చంద్రబాబు గుర్తు చేశారు. దక్షిణ భారత్‌లో గేట్స్ పౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్‌వేగా నిలపాలని లోకేశ్ కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఏర్పాటు చేయనున్న ప్రపంచస్థాయి ఏఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించాలని కోరారు.
మీ అమూల్యమైన సలహాలు ఏపీలో ఐటీ అభివృద్ధికి దోహదం చేస్తాయని బిల్‌గేట్స్‌కి తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్‌ని ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఏపీలో ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకో సిస్టంని నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్‌బోర్డుల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరఫున నైపుణ్య సహకారం అందిచాలని విజ్ఞప్తి చేశారు. ఫౌండేషన్ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు.
దావోస్‌లో బిజీబిజీగా మంత్రి లోకేశ్ - పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు