Citizens for Democracy Program on Votes in Sathyasai District:శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలోని శివ సాయి డిగ్రీ కళాశాలనందు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో 'ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం' కార్యక్రమాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 'రంగం' కళాకారులు ప్రజా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల అనంతరం సంయుక్త కార్యదర్శి వల్లెం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు కళాజాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
'ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం' - విశాఖలో సీఎఫ్డీ కళాజాత ప్రారంభం
అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం యెుక్క విలువలు కాపాడాలని, రాజ్యాంగా స్ఫుర్తిని భధ్రంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఓటర్లను చైతన్య వంతులను చేసి వచ్చే ఎన్నికల్లో మంచి అభ్యర్థులను ఎన్నుకొవాలని కోరారు. సమాజానికి మంచి చేసే వారిని ప్రజలు ఎన్నుకునేందుకే ఈ కళాజాత ప్రారంభించామని తెలిపారు.
Kalajata program in Sathya Sai District :ఈ కళాజాత కార్యక్రమం శ్రీకాకుళంలో ఫిబ్రవరి 25న ప్రారంభమైందని, శుక్రవారం కర్నూలులో ముగుస్తుందని తెలిపారు. ప్రస్తుతం లోక్ సభలో 30 శాతం మంది నేరుస్థులు ఉన్నారని మండిపడ్డారు. వందలాది కోట్లు సంపాదించిన వారు లోక్సభలో సభ్యులుగా ఉన్నారని వీరు ఒక విషయంపై ఏకధాటిగా పది నిమిషాలు కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సైతం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.