CID Circulate Lookout Notice To MP Vijaya Sai Reddy :వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఏపీ సీఐడీ విభాగం లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేసింది. ఆయనతో పాటు ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి, అరబిందో యజమాని పెనక శరత్‌చంద్రారెడ్డి (Sarathchandra Reddy)పైనా ఎల్‌వోసీ ఇచ్చింది. వీరు ముగ్గురూ విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్ జారీ చేసింది.
విదేశాలకు పారిపోకుండా - విజయసాయిరెడ్డికి లుక్అవుట్ నోటీసులు - MP VIJAYA SAI REDDY
కాకినాడ సీ పోర్ట్స్, సెజ్ వాటాలపై నమోదైన కేసులో సీఐడీ దూకుడు - విజయసాయిరెడ్డితో పాటు పలువురికి ఏపీ సీఐడీ లుక్అవుట్ సర్క్యులర్ జారీ
![విదేశాలకు పారిపోకుండా - విజయసాయిరెడ్డికి లుక్అవుట్ నోటీసులు Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-12-2024/1200-675-23045511-thumbnail-16x9-cid-circulate-lookout-notice-to-mp-vijaya-sai-reddy.jpg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 5, 2024, 9:34 AM IST
Kakinada SEZ Shares Issue :కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని 3,600 కోట్ల రూపాయలు విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో వీరు కీలక నిందితులుగా ఉన్నారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కర్నాటి వెంకటేశ్వరరావును బెదిరించి, భయపెట్టి అత్యధిక శాతం షేర్లను అరబిందో సంస్థ పరం చేశారనేది వీరిపై ప్రధాన అభియోగం.
జగన్ మరో దాష్టీకం వెలుగులోకి - రాక్షస రాజకీయంతో కాకినాడ పోర్టు అరబిందో పరం!