ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ - CBN pawan At anant ambani marriage - CBN PAWAN AT ANANT AMBANI MARRIAGE

CBN Pawan At Anant Ambani Marriage: బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్‌ వివాహానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ తారలు హాజరవుతున్నారు. తాజాగా ముంబయిలో జరుగుతున్న అనంత్ అంబానీ వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​ హజరయ్యారు. అనంత్-రాధిక దంపతులను చంద్రబాబు దంపతులు ఆశీర్వదించారు.

CBN pawan At anant ambani marriage
CBN pawan At anant ambani marriage (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 10:31 PM IST

CBN Pawan At Anant Ambani Marriage: ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్‌ వివాహానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ముంబయిలో సందడి చేస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార, తదితర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరై అనంత్ అంబానీ-రాధిక దంపతులను చంద్రబాబు దంపతులు ఆశీర్వదించారు. వీరితో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా వేడుకలో పాల్గొన్నారు.

వేరే లెవెల్​లో అనంత్ బరాత్- అంబానీ ఇంట పెళ్లా మజాకా! - Anant Radhika Wedding

తళుక్కుమన్న తారలు:ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌లో జరిగిన అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ వివాహ వేడుకకు ఇప్పటికే ఏపీ, తెలంగాణ నుంచి పలువురు సినీ, రాజకీయ నేతలు, క్రీడా రంగానికి చెందిన వారు హాజరయ్యారు. తాజాగా శుక్రవారం రాత్రి జరిగిన వివాహ వేడుకకు దేశ విదేశాల తారలు తరలి వచ్చారు.

అయితే ఈ వేడుకలో బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా సౌత్ నుంచి కుడా పలువురు హాజరయ్యారు. వీరిలో సూపర్ స్టార్​ మహేశ్​ బాబు ఫ్యామిలీతో పాటు మెగా పవన్ స్టార్ రామ్​చరణ్ - ఉపాసన దంపతులు హాజరయ్యారు. అలాగే రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్​, అక్కినేని అఖిల్ ఈ వేడుకలో మెరిసారు. వీరితో పాటు సూపర్ స్టార్ రజనీ కాంత్, సూర్య ఫ్యామిలీ, రష్మిక సహా మరికొందరు సెలబ్రిటీలు హాజరయ్యారు.

Anant Ambani Wedding: మరోవైపు అనంత్‌ వివాహం యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. 7 నెలల క్రితం మొదలైన వివాహ వేడుకలు ఈనెల 14వ తేదీతో ముగుస్తాయి. అత్యంత ఆడంబరంగా నిర్వహిస్తున్న అనంత్‌ అంబానీ వివాహవేడుకకు పెద్దమొత్తంలో ఖర్చు చేసినట్లు కనిపిస్తుంది. ఈ మొత్తం వివాహ వేడుక కోసం రూ.4 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్ల వరకు ఖర్చుచేసి ఉంటారని అంచనా.

ఒకే ఫ్రేమ్​లో ధోనీ, మహేశ్​ - సోషల్​ మీడియాను షేక్​ చేస్తున్న ఈ పిక్ చూశారా? - Dhoni Mahesh Babu

ABOUT THE AUTHOR

...view details