ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబుపై రాళ్లదాడి కేసు - పోలీసుల అదుపులో నిందితులు - CHANDRABABU STONE PELTING CASE

ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నందిగామ పోలీసులు - 2022లో నందిగామ పర్యటనలో చంద్రబాబుపై రాళ్ల దాడి

CHANDRABABU_STONE_PELTING_CASE
CHANDRABABU STONE PELTING CASE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2024, 4:29 PM IST

CHANDRABABU STONE PELTING CASE : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సీఎం చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడికి పాల్పడిన కేసులో ముగ్గురు వ్యక్తులను నందిగామ పోలీసులు అదుపులో తీసుకున్నారు. 2022 నవంబర్ 5వ తేదీన అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నందిగామలో పర్యటించారు. స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్​లో వీధిలైట్లు ఆర్పి చంద్రబాబు లక్షంగా రాళ్ల దాడి చేశారు.

ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ రావుకు గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కేసు గురించి పట్టించుకోలేదు. తాజాగా పోలీసులు ఈ కేసును వెలుగులోకి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. దీనిలో నందిగామకు చెందిన కనికంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

టీడీపీ కార్యాలయంపై అటాక్​ కేసు - దాడి చేసిన వారికి డబ్బులు - TDP Central Office Attack Case

ABOUT THE AUTHOR

...view details