Chandrababu Conference with Alliance leaders: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని కితాబిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు పురందరేశ్వరి, అరుణ్ సింగ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ లు పాల్గొన్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ రాష్ట్రంలో కూటమి విజయం వైపే మొగ్గు చూపించాయని పేర్కొన్నారు. అభ్యర్థి ఎవరైనా ఓట్లు బదిలీ కావాలన్న ఉద్దేశ్యంతో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కష్టపడి పని చేశారని చెప్పారు. ఓటమి భయంతో కౌంటింగ్ పై వైఎస్సార్సీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే అధికార పార్టీ తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడిందని ఎద్దేవా చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని చూశారని దుయ్యబట్టారు. కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉంది, కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలని, అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పని చేయాలన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ ల నుండి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యహరించాలని చెప్పారు.
సీఎం సీఎం అంటూ చంద్రబాబుకు ఘన స్వాగతం! - Welcome to Chandrababu