తెలంగాణ

telangana

ETV Bharat / state

బెంగళూరు రేవ్​ పార్టీ కేసు - రెండోసారి నటి హేమకు నోటీసులు - second time notice to actress hema - SECOND TIME NOTICE TO ACTRESS HEMA

Bangalore Rave Party Case Update : రెండోసారి నటి హేమకు సీసీబీ పోలీసులు నోటీసులు పంపించారు. బెంగళూరు రేవ్​ పార్టీ కేసులో మొదటిసారి విచారణకు హేమ హాజరు కాలేదు. ఇప్పుడు జూన్​ 1న విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు పంపించింది.

Bangalore Rave Party Case Update
Bangalore Rave Party Case Update (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 29, 2024, 5:32 PM IST

Updated : May 29, 2024, 6:23 PM IST

Second Notice by CCB Police to Telugu Actress Hema : బెంగళూరు రేవ్​ పార్టీ కేసులో నటి హేమకు మరోమారు బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు పంపారు. జూన్​ 1న స్వయంగా హేమ విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. ఈనెల 27న కేసు విచారణకు హాజరుకావాలని హేమకు పోలీసులు అదే నెల 25న 8మందితో పాటు నోటీసులు పంపించారు. కానీ నటి హేమ మాత్రం విచారణకు హాజరు కాలేదు. అనారోగ్య కారణాలు చూపుతూ విచారణకు ఒక వారం గడువు కావాలని కోరింది. దీంతో సీసీబీ పోలీసులు మరో నోటీసును విచారణకు జూన్​ 1న విచారణకు హాజరు కావాల్సిందిగా పంపించారు.

అసలేం జరిగింది :మే 20వ తేదీ రాత్రి బెంగళూరు శివార్లలోని హెబ్బగోడి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని జీఆర్​ ఫామ్​ హౌస్​లో రేవ్​ పార్టీ జరిగింది. ఈ విషయంపై సీసీబీ పోలీసులు తెలుసుకుని దాడి చేశారు. ఈ దాడి జరిగిన తర్వాత ఘటనాస్థలంలో కొన్ని మాదకద్రవ్యాలు, ఆంధ్రప్రదేశ్​ ఎమ్మెల్యే పాసు ఉన్న కారు కూడా లభ్యమయ్యాయి. పార్టీలో పాల్గొన్న 103 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 86 మందికి పాజిటివ్​ వచ్చింది. అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. అలాగే పార్టీ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై వాసు, యం.అరుణ్‌కుమార్‌, నాగబాబు, రణధీర్‌బాబు, మహ్మద్‌ అబూబకర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ క్రమంలో నటి హేమతో సహా 8 మందికి సీసీబీ పోలీసులు విచారణకు హాజరు కావాలని ఈనెల 25న నోటీసులు పంపించారు. ఈనెల 27న విచారణకు నటి హేమ వెళ్లలేదు. అందుకు ఆమె అనారోగ్య కారణాలను చూపించారు. అంతకు ముందు ఆమె ఆ రేవ్​ పార్టీలో పాల్గొనలేదంటూ ఓ వీడియోను విడుదల చేసింది. అయితే బెంగళూరు సీపీ మాత్రం నటి హేమ రేవ్​ పార్టీలో పాల్గొన్నారని తెలిపారు. అయితే ఇప్పుడు ఆమెకు డ్రగ్స్​ పరీక్షలు చేయగా నెగెటివ్​ వచ్చింది. ఇప్పుడు పోలీసులు మళ్లీ రెండోసారి జూన్​ 1న విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించారు. ఇంకా పోలీసులు ఈ డ్రగ్స్​ పార్టీకి సంబంధించి లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

తెలుగు నటి హేమతో సహా 8 మందికి నోటీసులు - ఈ నెల 27న విచారణ - CCB Notices to Telugu Actress Hema

రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు : బెంగళూరు పోలీస్ కమిషనర్ - Bangalore Rave Party Details

Last Updated : May 29, 2024, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details