ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సినీనటుడు అల్లు అర్జున్​పై నంద్యాలలో కేసు నమోదు - Case Registered Against Allu Arjun - CASE REGISTERED AGAINST ALLU ARJUN

Case Registered Against Actor Allu Arjun in Nandyala: సినీనటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఈ రోజు అల్లు అర్జున్ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఎలాంచి అనుమతి తీసుకోకుండా ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వెళ్లండంతో అల్లు అర్జున్‌ సహా ఎమ్మెల్యే శిల్పా రవిపై నంద్యాల టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

case_on_allu_arjun
case_on_allu_arjun (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 11, 2024, 10:50 PM IST

Case Registered Against Actor Allu Arjun in Nandyala:సినీనటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. ఎలాంటి అనుమతి తీసుకోకుండా శనివారం ఆయన నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వెళ్లారు. దీంతో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీగా గుమికూడారు. సెక్షన్‌ 144, పోలీసు 30 యాక్టు అమల్లో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా పర్యటించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అల్లు అర్జున్‌ సహా ఎమ్మెల్యే శిల్పా రవిపై నంద్యాల టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Allu Arjun in Nandyala: నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ దంపతులు వచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని శిల్పా అభిమానులకు సూచిస్తే అల్లు అర్జున్ కూడా అదే సూచన చేశారు. తన మిత్రులు ఎక్కడ ఉన్నా తాను సహకరిస్తానని అర్జున్ చెప్పారు. ఎన్నికల వేళ ఇలా కలిస్తే మరోలా అనుకుంటారని అర్జున్​కు చెప్పినా వినకుండా నంద్యాలకు వచ్చి నన్ను కలవడం సంతోషంగా ఉందని శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details