Campus Placements at PB Siddhartha College in Vijayawada :ఉద్యోగమేళా, ప్రాంగణ నియామాకాలు గత ఐదేళ్లుగా ఏపీలో ఎక్కడా వినిపించని పదాలు ఇవి. ఉపాధి కోసం యువత ఊరు విడిచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లి సొంతంగానే పని వెతుక్కోవాల్సి వచ్చింది. ఇంజినీరింగ్, డిగ్రీ పట్టాలు పొందినా ఉద్యోగాలు ఇచ్చే వారు లేక నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రాంగణ నియామకాల్లో కదలిక వచ్చింది. దీంతో విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు.
వైఎస్సార్సీపీ నేతల నిర్వాకం - బడిని కబ్జా చేసి బ్యాంకులో తాకట్టు పెట్టారు - Govt School Acquisition
ప్రాంగణ నియామకాలకు విశేష స్పందన :విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో ఎంఎన్సీ (MNC) సంస్థ జెన్‌ఫ్యాక్ట్ నిర్వహించిన ప్రాంగణ నియామకాలకు విశేష స్పందన లభించింది. వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాన్-ఐటీ పోస్టులకు నిర్వహించిన ఆన్ లైన్ పరీక్షలు, రాతపరీక్షలకు మంచి స్పందన కనిపించింది. ఎన్ఆర్టీ విభాగం, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నియామక ప్రక్రియ అభ్యర్థుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. సుమారు 350 మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా వీరందరికీ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు, రాతపరీక్షల ద్వారా సామర్థ్యాలను లెక్కించారు. ప్రతిభ చూపిన వారికి నియామక పత్రాలు అందించనున్నారు. నాన్-ఐటీ సెక్టార్‌లో పోస్టులకు ఈ ప్రాంగణ నియామకాలు చేపట్టారు. ఒక్కసారిగా పరీక్షలు, ఇంటర్వ్యూలు అనేసరికి అభ్యర్థుల్లో సరికొత్త ఉత్సాహం కన్పించింది.