ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మవోయిస్టులకు మరో ఎదురు దెబ్బ- ఏవోబీలో నాలుగు భారీ డంప్‌లు స్వాధీనం - BSF POLICE SEIZE DUMPS IN AOB

డంప్‌లో బాంబ్‌లు, ఎలక్ట్రిక్‌ డిటొనేటర్లు, ఎస్‌ఎంబీఎల్‌ తుపాకులు - బాంబ్‌లను నిర్వీర్యం చేసినట్లు మల్కాన్‌గిరి పోలీసు కార్యాలయం ప్రకటన

BSF Police Seize Dumps Set Up By Maoists at Four Places in AOB
BSF Police Seize Dumps Set Up By Maoists at Four Places in AOB (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2025, 3:57 PM IST

BSF Police Seize Dumps Set Up By Maoists at Four Places in AOB : ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. నాలుగు చోట్ల మావోయిస్టులు అమ‌ర్చిన డంప్‌ల‌ను బీఎస్​ఎఫ్ పోలీసు బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఏవోబీలో మ‌ల్క‌న్‌గిరి జిల్లా పొడియా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని అట‌వీప్రాంతంలో బీఎస్​ఎఫ్​కు చెందిన రెండో బెటాలియ‌న్ పోలీసులు గాలింపు చ‌ర్య‌ల‌కు వెళ్లారు. వీరికి గురువారం సాయంత్రం నాలుగు చోట్ల అమ‌ర్చిన డంప్‌ల‌ు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌ల‌లో 5 కిలోల బ‌రువైన ప్రెష‌ర్ బాంబు, 5 టిఫిన్ ఐఈడీ బాంబులు, మూడు ఎల‌క్రిక్ డిటోనేట‌ర్లు, ఎల‌క్ర్టిక‌ల్ వైర్‌, రెండు ఎస్‌ఎంబీఎల్ తుపాకీలు స్వాధీనం చేసుకున్న‌ట్లు మ‌ల్క‌న్‌గిరి జిల్లా పోలీసు కార్యాల‌యం ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న బాంబ్‌లను సంఘటనా స్థలంలో నిర్వీర్యం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Police found Landmine of Maoists : గత ఏడాది కూడా ఇలాంటి మావోయిస్టుల కుట్రను ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో పోలీసులు ఛేదించారు. మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలను పోలీసులు కనుగొన్నారు. ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లోని మల్కనగిరి జిల్లా కలిమిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గొంప‌కొండ అట‌వీ ప్రాంతంలో పోలీసుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమ‌ర్చిన మందుపాత‌ర‌ల‌ను వారు స్వాధీనం చేసుకున్నారు. క‌లిమెల పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో బొడిగెట్ట‌కు చెందిన బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు మావోయిస్టుల కోసం గాలిస్తుండ‌గా గొంప‌కొండ కెనాల్ వంతెన దగ్గర మావోయిస్టులు అమ‌ర్చిన ఆ మందుపాత‌ర‌ను గాలింపు బ‌ల‌గాలు గుర్తించాయి.

వీటిని తీసేందుకు ఎంతో శ్రమించారు. మందుపాత‌ర‌, డిటోనేట‌ర్, 30 మీట‌ర్లు ప్లాస్టిక్ వైర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని మందుపాత‌ర‌ను నిర్వీర్యం చేశారు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. అత్యంత ధైర్య సాహసాలతో ఆయుధాలను అధికారులు ఛేదించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక రాజకీయ నేతలు ఈ విషయం తెలుసుకుని పోలీసులను అభినందించారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్ట్ డంప్ లభ్యం.. ఏం ఉన్నాయంటే..?

ఏఒబీలో మావోయిస్టుల డంప్‌ స్వాధీనం- పోలీసుల‌ను ల‌క్ష్యంగా అమ‌ర్చిన బాంబులు - Maoist Dump Seized

ABOUT THE AUTHOR

...view details