ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫార్ములా ఈ కార్​ రేసింగ్​పై చర్చించే సత్తా ప్రభుత్వానికి లేదు: కేటీఆర్​ - KTR ON FORMULA E CAR RACING

ఫార్ములా- ఈ రేసింగ్ కేసుపై హైకోర్టును ఆశ్రయించనున్న కేటీఆర్​ - హైకోర్టులో క్వాష్ పిటిషన్ !

KTR Reaction About ACB Case
KTR Reaction About ACB Case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2024, 8:51 PM IST

Updated : Dec 19, 2024, 10:43 PM IST

KTR Reaction About ACB Case on E Formula Car Racing:తెలంగాణను ఎలక్ట్రిక్‌ వాహనాలకు హబ్‌గా మార్చాలనే లక్ష్యంతోనే హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ నిర్వహించామని మాజీ మంత్రి, బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (కల్వకుంట్ల తారక రామారావు) తెలిపారు. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో ఏసీబీ తనపై కేసు నమోదు చేయడంపై తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

చంద్రబాబు ఈ రేస్ నిర్వహించేందుకు యత్నించారు: హైదరాబాద్‌లో ఫార్ములా- ఈ కార్ రేస్ జరపాలని చాలా ప్రయత్నాలు జరిగాయని కేటీఆర్ తెలిపారు. 2001లోనే చంద్రబాబు ఫార్ములా-1 రేస్ నిర్వహించేందుకు యత్నించారని కాని దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదని పేర్కొన్నారు. ఫార్ములా- ఈ కార్ అంశంపై నాలుగు కోట్ల ప్రజల మధ్య అసెంబ్లీలో చర్చ పెట్టాలని స్పీకర్​ను కోరామని కేటీఆర్ తెలిపారు. ఫార్ములా- ఈ కార్ అంశంపై చర్చించే సత్తా ప్రభుత్వానికి లేదని అందుకే ఈ అంశంలో అక్రమాలు చేశామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలు నిరూపించకుండా లీకులిస్తూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్ములా-1 రేస్ ట్రాక్ కోసం గోపన్‌పల్లిలో భూ సేకరణ జరిగిందని కేటీఆర్ అన్నారు.

చాలా మంది ప్రముఖులు ప్రశంసించారు:ఎఫ్‌-1 చుట్టూ నగరాల అభివృద్ధి ఆధారపడి ఉంటుందని అంతే కాకుండా ఈ ఎఫ్‌-1 రేస్‌ల నిర్వహణకు దేశవ్యాప్తంగా పోటీ ఉందని తెలిపారు. 2001లో చంద్రబాబు జినోమ్‌వ్యాలీ ఏర్పాటు చేశారని నాడు ఏర్పాటు చేసిన జినోమ్‌వ్యాలీ ఇప్పుడు ఉపయోగపడుతుందని అన్నారు. వరుసగా 4 సీజన్లు ఫార్ములా- ఈ కార్ రేస్‌ నిర్వహణకు ఒప్పందం చేసుకున్నామని కేటీఆర్ వివరించారు. ఈ కార్‌ రేసింగ్‌ క్రెడిట్‌ను పొందేందుకు బీజేపీ కూడా ప్రయత్నించిందని ఆరోపించారు. కేంద్ర సహకారంతోనే ఈ కారు రేసింగ్‌ జరుగుతోందని కిషన్‌రెడ్డి అన్నారని వివరించారు. దేశంలో ప్రముఖులైన సచిన్‌, ఆనంద్ మహేంద్ర వంటి వాళ్లు ఈ రేసింగ్‌ను ప్రశంసించారని వెల్లడించారు. క్రికెటర్లు, బాలీవుడ్‌ ప్రముఖులను ఈ కార్‌ రేసింగ్‌ ఆకర్షించిందని తెలిపారు. తర్వాత సీజన్‌ను ముంబయిలో నిర్వహించాలని మహారాష్ట్ర సీఎం కూడా అడిగారని కేటీఆర్ వివరించారు.​

ఫార్ములా ఈ-కార్ల రేసింగ్​పై ఏసీబీ విచారణ? - ఏ అంశాలపై దర్యాప్తు జరగనుంది?

రేసింగ్‌పై రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది:హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్స్‌కు జీహెచ్‌ఎంసీ బాధ్యత వహిస్తుందని అంతే కాకుండా జీహెచ్‌ఎంసీకి ఎంతో ప్రచారం, ఆదాయం వచ్చిందని కేటీఆర్ అన్నారు. ఈ- కార్‌ రేసింగ్‌పై రూ.150 కోట్లు ఖర్చు చేస్తే రూ.750 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఎలక్ట్రికల్‌ వాహనాలకు హైదరాబాద్‌ను హబ్‌గా మార్చాలనేది మా ప్రణాళిక అని రేసింగ్‌ ద్వారా ఈవీ కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించాలనేది నా ఆలోచన అని కేటీఆర్ అన్నారు. నష్టం వచ్చిందని ప్రమోటర్లు అంటే మేం డబ్బు చెల్లించామని తెలిపారు. ప్రమోటర్లకు ఆ డబ్బు చెల్లించటం వల్లే రేసింగ్‌ ఇక్కడ జరిగిందిని స్పష్టం చేశారు. కాంట్రాక్టు వివాదాలు చాలా నగరాల్లో సహజంగా జరుగుతుంటాయని అన్నారు.

నిర్వాహకులకు నిధులు చెల్లించింది వాస్తవం:రేసింగ్‌ ప్రమోటర్లు గతేడాది డిసెంబర్‌ 13న సీఎం రేవంత్‌రెడ్డిని కూడా కలిశారని వచ్చే మూడేళ్లు కూడా హైదరాబాద్‌ రేసింగ్‌ నిర్వహిస్తామంటూ దానకిశోర్‌కు ఆల్బర్టో లేఖ రాశారని కేటీఆర్ అన్నారు. మరోసారి ఈ- కార్‌ రేసింగ్ నిర్వహణకు కొత్త సీఎం కూడా సుముఖంగా ఉన్నారని లేఖ రాశారని తెలిపారు. మరోసారి నిర్వహణపై డిసెంబర్‌ 21లోపు స్పష్టత ఇవ్వాలని మెయిల్‌ పెట్టారని వెల్లడించారు. రేసింగ్‌ రద్దు అయిపోగానే ఎఫ్‌ఎంఎస్‌ వాళ్లు రూ.74 లక్షలు చెల్లించారని అన్నారు. ప్రభుత్వం నిర్వాహకులకు రూ.55 కోట్లు చెల్లించింది వాస్తవని వెల్లడించారు. హెచ్‌ఎండీఏ నుంచి రూ.55 కోట్లు తీసుకున్నట్లు నిర్వహకులు చెప్తున్నారని తెలిపారు. లైసెన్స్‌ ఫీజు రూ.74 లక్షలు వాపస్‌ పంపుతూ ఎఫ్‌ఎంఎస్‌ఏ వాళ్లు లేఖ రాశారని అన్నారు.

ఈ కార్ రేసింగ్​లో అవినీతి జరిగిందెక్కడో సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరి వల్ల తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటోంది. హైదరాబాద్‌లో ఈవెంట్లకు మరోసారి నిర్వాహకులు ముందుకు రారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నిర్వాహకులు కూడా కేసు పెడతారు. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి భయపడేది లేదు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకే ఫార్ములా ఈ – రేసింగ్‌ నిర్వహించాము. న్యాయపరంగా ఏం చేయాలో అది చేస్తాము.- కేటీఆర్​, బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు

స్టేషన్​లోనే మందేసి పోలీసులకు చుక్కలు చూపించాడు - చివరికి ఏమైందంటే!

విజయం ఊరికే రాదు - కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదు: నారా భువనేశ్వరి

Last Updated : Dec 19, 2024, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details