MALLA REDDY DANCE: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన పేరు తెలియన వారు ఉండరేమో. ఆయన స్పీచ్‌లకు, డ్యాన్సులకు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆయన స్పీచ్ ఇచ్చారంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, మల్లరెడ్డి పేరు వార్తల్లో నిలవాల్సిందే. తాజాగా మల్లారెడ్డి మరోసారి మాస్ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇంతకీ ఆయన ఎందుకు డ్యాన్స్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
తన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహం ఈ నెల 27వ తేదీన జరగనుంది. దీంతో ప్రస్తుతం పెళ్లికి ముందు జరిగే పలు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం రాత్రి సంగీత్ కార్యక్రమం జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు హాజరైన ఈ వేడుకలో మల్లారెడ్డే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. తన మనవరాలి పెళ్లి సంగీత్‌లో స్టెప్పులు వేసి తనకు తానే సాటి అనిపించుకున్నారు మల్లారెడ్డి.
కొరియోగ్రాఫర్స్‌తో శిక్షణ తీసుకుని మరీ: ఏదైనాసరే పర్ఫెక్ట్గా చేసే మల్లారెడ్డి దీనిని కూడా అలాగే చేయాలి అనుకున్నారు. దీనికోసం కొరియోగ్రాఫర్స్‌తో శిక్షణ తీసుకుని మరీ డ్యాన్స్‌లో ప్రత్యేక స్టెప్పులు వేసి అదరగొట్టారు. సంగీత్కి వచ్చిన అతిథులకు, బంధుమిత్రులకు తన డ్యాన్స్‌తో ఉల్లాసాన్ని నింపారు.