ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండల మధ్య జలాశయం - బ్రహ్మసాగర్​ అందాలను చూసి తీరాల్సిందే!

పర్యాటకులను ఆకర్షిస్తున్న బ్రహ్మం సాగర్

BRAHMASAGAR_ATTRACTING_TOURISTS
BRAHMASAGAR_ATTRACTING_TOURISTS (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Brahmasagar Attracting Tourists in YSR District :చుట్టూ కొండలు, మధ్యలో జలాశయం. ఎటు చూసినా పరుచుకున్న పచ్చదనం. ఆకాశం నుంచి పడుతున్న తెల్లని మంచు. గలగల పారే నీరు. మనసును ఇట్టే కట్టిపడేస్తున్నా ప్రకృతి అందాలను చూడాలంటే వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం వెళ్లాల్సిందే. ఇటీవల కురిసిన వర్షాలకు బ్రహ్మ సాగర్​లోకి వచ్చి భారీ వరద వచ్చి చేరింది.

కొండల మధ్య జలాశయం - బ్రహ్మసాగర్​ అందాలను చూసి తీరాల్సిందే! (ETV Bharat)

ప్రస్తుతం బ్రహ్మ సాగర్​లో 17.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో అధికారులు ఎడమ కాలువ ద్వారా నీటిని దిగువ వదిలారు. ఈ నేపథ్యంలోనే కాలువల్లో నీరు తెల్లటి పాల వలే పొంగుతున్న నీటి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రాజెక్ట్​కు వెళ్లే మార్గం గుండా వివిధ రకాల పూల మొక్కలు, చల్లటి గాలికి కదిలే ఆకులు పర్యాటకులకు మధుర అనుభూతిని కలిగిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్​కు సమీపంలోనే బ్రహ్మం గారి మఠం ఉంది. అక్కడ కొలువైన వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకొని బ్రహ్మ సాగర్​ను చూడటానికి వెళ్తు ఉంటారు. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల పర్యాటకులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన వారు కూాడా అధిక సంఖ్యలో సందర్శిస్తారు.

ABOUT THE AUTHOR

...view details