BJP MLAs Chit chat With Assembly: ఏపీ అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యేల చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలోకి వస్తామని తమతో చర్చించారని విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డిలు తెలిపారు. వారిని చేర్చుకోవాలా లేదా అనే అంశంపై పార్టీ నేతలతో మాట్లాడుతున్నామన్నారు. వైఎస్సార్సీపీకి ఎలా ప్రతిపక్ష నేత హోదా ఇస్తారని మండిపడ్డారు. ప్రతి పక్ష హోదా కోసం కోర్టుకు వెళ్లమని జగన్‌కు ఎవరు సలహా ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు.
జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు 21 గెలుచుకుందని, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే ముందుగా జనసేన పార్టీ కి ఇవ్వాలని, పోటీ చేసిన స్థానాల్లో తెలుగుదేశం 94 శాతం, జనసేన 100 శాతం, బీజేపీ 80 శాతం స్థానాల్లో గెలిచాయని వారు తెలిపారు. వైఎస్సార్సీపీ 175 స్థానాల్లో పోటీ చేసి 6 శాతం సీట్లు మాత్రమే గెలిచిందన్నారు. 6 శాతం సీట్లు గెలిచిన వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష నేత హోదా ఎలా ఇస్తారని నేతలు ప్రశ్నించారు. జగన్ దిల్లీలో చేస్తున్న ధర్నా ప్రచార స్టంట్ మాత్రమేనని బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డిలు ఎద్దేవా చేశారు.
ప్రధానికి లేఖ రాసేముందు మీ అరాచకాలు గుర్తుకురాలేదా?- వైఎస్సార్సీపీ నేతలకు పురందేశ్వరి చురకలు - BJP Purandeswari Fire on YSRCP
ఇటీవల అసెంబ్లీలోని మంత్రి ఛాంబర్లో నారా లోకేశ్‌తో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. వైఎస్సార్సీపీ నేతలు బీజేపీలో చేరికపై మంత్రి లోకేశ్, కూటమి నేతల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పార్థసారథి, ఈశ్వరరావు లోకేశ్‌ను కలిశారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవట్లేదని బీజేపీ నేతలు తెలిపారు. అలాంటిది ఏమైనా ఉంటే కలసి కూర్చుని చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
గత నెలలో వైఎస్సార్సీపీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మినహా మిగిలిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా బీజేపీలో చేరాలనుకుంటున్నారని, ఇందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారని చెప్పారు. స్వయంగా మిథున్‌రెడ్డి బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారని చెప్పారు. ఆయన తన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలోకి రావాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. బీజేపీ నాయకత్వం వద్దంటున్నా మిథున్‌రెడ్డి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఆదినారాయణరెడ్డి తెలిపారు.
లోకేశ్ ఛాంబర్లో బీజేపీ నేతలు- తమ పార్టీలో వైసీపీ నేతల చేరికలపై చర్చ