ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షాధారణ - జగన్మాత నామస్మరణలతో మార్మోగిన దుర్గమ్మ ఆలయం

దుర్గమ్మ సమక్షంలో మాలధారణ కార్యక్రమానికి శ్రీకారం

BHAVANI_DEKSHALU_IN_VIJAYAWADA
BHAVANI_DEKSHALU_IN_VIJAYAWADA (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2024, 12:36 PM IST

Bhavani Dekshalu Begins on Indrakiladri in Vijayawada : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భవానీ దీక్షాధారణ కార్యక్రమం ప్రారంభమైంది. భవానీల జగన్మాత నామస్మరణలతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. మహామండపం 6వ అంతస్తులో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ అధికారులు ప్రత్యేకంగా అలంకరించారు. దుర్గమ్మ సమక్షంలో మాలధారణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు భవానీ మండలదీక్ష ధారణ జరగనున్నట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు.

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షాధారణ - జగన్మాత నామస్మరణలతో మార్మోగిన దుర్గమ్మ ఆలయం (ETV Bharat)

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

దుర్గమ్మ సమక్షంలో మాలధారణ :ఈ నెల 15 వరకు మండల దీక్ష దారణకు సమయంగా వైదిక కమిటీ నిర్ణయించినట్లు ఆలయ ఈవో రామరావు పేర్కొన్నారు. దేవస్థానం తరపున ఆచార్య గురు భవానీగా ఆలయ పండితులు యద్దనపూడి నాగరాజు శాస్త్రి, యనమండ్ర ఉమాకాంత శర్మను నియమించినట్లు తెలిపారు. అమ్మవారి మండల దీక్ష ధారణ స్వీకరణకు హాజరైన వారంతా అమ్మవారి సన్నిధిలో జై దుర్గా జైజై దుర్గా అంటూ నామస్మరణాలతో దీక్ష స్వీకరించారు. దీక్షాధారణ స్వీకరించిన భక్తులంతా అమ్మవారి నామాలు, నియమములతో కూడిన భవాణీ దీక్షా కరపత్రాలు, ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన శ్రీనిధి లలితా సహస్ర నామ పుస్తకాలను ఆలయ ఈవో కెఎస్ రామరావు అందజేశారు.

సరస్వతీదేవి రూపంలో అమ్మవారు - రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు

మహా పూర్ణాహుతి కార్యక్రమం :డిసెంబరు 1వ తేదీ నుంచి 5వ తేదీవరకు 21 రోజుల అర్ధమండల దీక్ష కార్యక్రమం జరుగుతుందని ఆలయ ఈవో రామరావు వెల్లడించారు. డిసెంబరు 14న పౌర్ణమి రోజున సాయంత్రం 6.30 గంటలకు సత్యనారాయణపురం శివరామ నామ క్షేత్రం నుంచి కలశజ్యోతులు కార్యక్రమం జరగనుందన్నారు. డిసెంబరు 21 నుంచి 25 వరకు అమ్మవారి దీక్షా విరమణ చేయొచ్చని, అందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. డిసెంబరు 25వ తేదీ ఉదయం 10 గంటలకు మహా పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీదీక్ష కార్యక్రమం పరిసమాప్తం అవుతుందన్నారు.

ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవిగా దుర్గమ్మ - దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details