ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతా రామమయం - రాష్ట్రంలో భారీ ఎత్తున శోభాయాత్రలు - రాష్ట్రంలో రాముని శోభాయాత్రలు

Ayodhya Ram Mandir Inauguration Program : ప్రస్తుతం దేశమంతటా రామ నామ స్మరణతో మారుమోగుతోంది. అలాగే రాష్ట్రంలోని పలుచోట్ల ర్యాలీలు, నృత్యాలు చేస్తూ భారీ ఎత్తున శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. మరి కొన్ని చోట్ల అయోధ్య భక్తులు రాముని చిత్రలు వేసి భక్తిని చాటుకుంటున్నారు.

Ayodhya_Ram_Mandir_Inauguration_Program
Ayodhya_Ram_Mandir_Inauguration_Program

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2024, 6:00 PM IST

అంతా రామమయం - రాష్ట్రంలో భారీ ఎత్తున శోభాయాత్రలు

Ayodhya Ram Mandir Inauguration Program :సోమవారం అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం దేశం మెుత్తం ఎదురుచూస్తోంది. అలాగేే రాష్ట్రంలోని పలుచోట్ల సందడి వాతావరణం నెలకొంది. బాలరాముని అయోధ్య ప్రతిష్ట సందర్భంగా ఒంగోలు నగరంలో మార్వాడీ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. 125 దివ్య కళాశాలలతో రాముల వారిని వెండి రథం మీద కూర్చోబెట్టి శోభయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో భక్తులు, చిన్నారులు, పెద్దలు అందరూ పాల్గొన్నారు.

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ- ఆహ్వానం అందుకున్న దిగ్గజాలు వీరే

ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసే ఉమామహేశ్వరరావు ఒక సూక్ష్మ కళాకారుడు. 20ఏళ్లుగా ప్రకృతిని పరిరక్షించమని కోరుతూవేలాది చిత్రాలు వేశాడు. అయోధ్యలో రాముడు విగ్రహ ప్రతిష్ట సందర్భంగా 22న జరిగే ఉత్సవం కోసం భక్తితో ఆకుమీద అయోధ్య రాముని చిత్రాన్ని ఆరుగంటలు నిరంతరం శ్రమించి తయారు చేశారు. అందరూ ఉపాధ్యాయుడి సేవను అభినందిస్తున్నారు.

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కడపకు చెందిన కళ్యాణ్ అనే యువకుడు హరిత హోటల్ ఆవరణంలో రంగోలితో బాల రాముడు బొమ్మ గీశాడు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి బాలరాముడు బొమ్మను వివిధ రంగులతో ఎంతో అందంగా వేశాడు. తనలాంటి కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని యువకుడు తెలిపాడు.

రాముడికి కానుకగా 400 కేజీల తాళం- రూ.1.65 లక్షల రామాయణం ప్రదర్శన

అయోధ్యలో రేపు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా కడపలో భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. శోభ యాత్రకు జిల్లా నలుమూలాల నుంచి దాదాపు పదివేల మంది ప్రజలు హాజరయ్యారు. ఈ శోభాయాత్ర చిన్నచౌక్​లోని ఆంజనేయ స్వామి దేవలయం నుంచి ప్రారంభమై హౌసింగ్ బోర్డ్ కాలనీలోని రాముని ఆలయం వరకు సాగింది. ర్యాలీలో కోలాటం, నృత్యాలు, చెక్కభజనలు, కేరళ వాయిద్యాలు, పాటకచేరితో పాటు వివిధ రకాల కార్యక్రమాలతో శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది.

Pran Pratishtha Ceremony in Uttar Pradesh : అలాగే కడప నగరమంతా శ్రీరామ నామంతో హోరెత్తిపోయింది. ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు తరలివచ్చారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు శ్రీరామ నామ స్మరాన్ని స్మరిస్తూ నృత్యాలు చేశారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుని వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రజలు శ్రీరాముని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప నగర పురవీధుల్లో ఈయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. వచ్చిన భక్తులకు భోజన వసతిని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు.

'ప్రాణప్రతిష్ఠకు రండి'- అయోధ్య కేసు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ఆహ్వానం

కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానంలో రామనామ స్మరణ చేస్తూ భక్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో శ్రీ రామ శోభాయాత్ర వైభవంగా జరిగింది. స్థానిక విజయ గణపతి ఆలయం నుంచి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. కాషాయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. మహిళలు చిన్నారులు పెద్దలు పాల్గొన్నారు.

అయోధ్య రాముడి కోసం మోదీ ఉపవాసం- కొబ్బరి నీళ్లు సేవిస్తూ, నేలపై నిద్రిస్తూ కఠోర దీక్ష

ABOUT THE AUTHOR

...view details