Auto overturned 25 Injured Road Accidents in Andhra Pradesh : కారణాలేవైనప్పటికీ రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో రోడ్లు రక్తమోడుతున్నాయి. బాధిత ప్రజలు అవిటితనంతో బతుకీడుస్తున్నారు. అతివేగం కారణంగా కొన్ని ప్రమాదాలు జరిగితే టైర్లు పేలి, డ్రైవర్ల నిర్లక్షం, రోడ్డు నియమాలు పాటించకపోవడం, కొన్ని ప్రాంతాల్లో రహదారి సరిగ్గా లేక ప్రమాదాలు ఎక్కువవుతూనే ఉన్నాయి. అయినా అతి వేగాన్ని మానుకోవడం లేదు కొందరు. ఏ విధంగా అయినా ప్రతీ రోజు ఒక్క ఘటన అయినా జరుగుతూనే ఉంది.
విద్యుత్ వైర్లు తగిలి లారీ దగ్ధం- అప్రమత్తమైన డ్రైవర్ - Fire Accident in Lorry in Kurnool
Auto overturned in Kurnool District :కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో కూలీలతో మిరప కోతలకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో 20 మందికి గాయాలు కాగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. హులేబీడు గ్రామానికి చెందిన కూలీలు చెప్పిగిరి మండలంలోని బంటనహల్, ఏరూరు, డేగులపాడు గ్రామాల్లో మిరప కోతలకు వెళ్తుంటారు. రోజులాగే ఉదయం పనులుకు వెళ్లి పనులు చేసి తిరిగి వస్తుండుగా హత్తి బెలగల్ గ్రామ సమీపంలో ట్రాలీ ఆటో టైర్ పగిలి ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఈరోజు ఆదోని ప్రైవేట్ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దస్తగిరమ్మ మృతి చెందగా, కర్నూలు ఆస్పత్రిలో శేకమ్మ కన్నుమూసింది. బాధితులకు ఆలూరు, ఆదోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది.
ట్రాఫిక్‌లో లారీ బ్రేకులు ఫెయిల్- వరుసగా వాహనాలు ధ్వంసం - Lorry Accident Parawada Lankepalem