Attempt Assault on Minor Girl in Eluru District:దుస్తులు కుట్టేందుకు కొలతలు తీసుకునే నెపంతో ఓ దర్జీ బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దల ద్వారా న్యాయం జరగకపోవడంతో బాలిక తల్లి కైకలూరు పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. తల్లి ఫిర్యాదు మేరకు టైలర్ సుల్తాన్‌పై పోక్సో యాక్ట్ కింద కైకలూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా కైకలూరులో సుల్తాన్ అనే వ్యక్తి స్థానికంగా నివాసముండే బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. సోడా కోసం దుకాణం వద్దకు వచ్చిన బాలికను దుస్తులు కుట్టేందుకు కొలతలు తీసుకునే నెపంతో టైలర్ సుల్తాన్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఒంటిపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ లైంగిక దాడికి యత్నించాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక అతని నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. అదే రోజు బాలిక తల్లి విషయాన్ని గ్రామ పెద్దలకు చెప్పడంతో వారు సమాచారం బయటకి పొక్కనివ్వలేదు. అయితే పెద్దల ద్వారా న్యాయం జరగకపోవడంతో బాలిక తల్లి కైకలూరు పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. తల్లి ఫిర్యాదు మేరకు టైలర్ సుల్తాన్‌పై పోక్సో యాక్ట్ కింద కైకలూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.