ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వచ్చే ఎన్నికల్లో జగన్​ను ఓడించాలి - ఏపీ సర్పంచుల సంఘం తీర్మానం - ఏపీ సర్పంచుల సంఘం

AP Sarpanches Association: పంచాయతీ వ్యవస్థను వైఎస్సార్​సీపీ నాశనం చేసిందని సర్పంచ్​లు అవేదన వ్యక్తం చేశారు. పంచాయతీల నిధులను కాజేసిందని, ఈ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఇంటికి పంపాలని సర్పంచ్​లు నిర్ణయించుకున్నారు. పంచాయతీలు మనుగడ సాధించాలంటే జగన్​ను ఖచ్చితంగా ఓడించాలని సర్పంచ్​ల సంఘం నేతలు పిలుపునిచ్చారు.

ap_sarpanches_association
ap_sarpanches_association

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 7:08 AM IST

జగన్​ను ఇంటికి పంపిస్తేనే పంచాయతీ రాజ్​ వ్యవస్థ మనుగడ : ఏపీ సర్పంచుల సంఘం

AP Sarpanches Association: పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసిన జగన్‌ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. పంచాయతీలు మనుగడ సాధించాలన్నా, సర్పంచులకు మంచి రోజులు రావాలన్నా జగన్‌ను ఇంటికి పంపడం తప్పనిసరని ఆ సంఘాల నేతలు తీర్మానించారు. పంచాయతీల సొమ్ములు జేబులో వేసుకున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా, ఈనెల 24 నుంచి అన్ని జిల్లాల్లోనూ నిరాహార దీక్షలు, కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాలని నిర్ణయించారు.

వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్‌ల పరిస్థితి, నిధులు, విధులు లేకుండా ఎదుర్కొన్న ఇబ్బందులపై ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్, ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ చర్చించింది. విజయవాడలో సర్పంచుల సంఘం నేతలు సమావేశం నిర్వహించారు. సచివాలయాలను ఏర్పాటు చేసి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రామాల్లో విలువే లేదు - వైఎస్సార్సీపీ సర్పంచుల అసహనం

జగన్‌ను ఓడించేందుకు సంసిద్ధంగా ఉన్నాం: వైఎస్సార్​సీపీ మళ్లీ అధికారంలోకి వస్తే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లను రద్దు చేసి రాజ్యాంగం కల్పించిన అధికారాలను వాలంటీర్లకు అప్పగిస్తారని సమావేశం సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు సిద్ధమంటున్న జగన్‌ను ఓడించేందుకు సంసిద్ధంగా ఉన్నామని సర్పంచ్​లు ప్రకటించారు. అధికారాలు, నిధుల కోసం మూడేళ్లుగా అలుపెరుగని పోరాటాలు చేసినా, ప్రభుత్వానికి పట్టలేదని నేతలు మండిపడ్డారు.

"వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీని ఇంటికి పంపిస్తేనే పంచాయతీ రాజ్​ వ్యవస్థ గ్రామాల్లో ఉంటుంది. ఇది రాజకీయ పరమైన నిర్ణయం. ఈ నిర్ణయాన్ని తీసుకోక తప్పడం లేదు మాకు. ఈ నిర్ణయాలు తీసుకోకుండా ఉండలేనుటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది." -వైవీబీ రాజేంద్రప్రసాద్‌, ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్ అధ్యక్షుడు

రాబోయే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు: వెనిగండ్ల రాము

సిద్ధం సభలో వాలంటీర్‌లను నాయకులుగా చేస్తానని సీఎం జగన్ అంటున్నారని మరి తమ పరిస్థితి ఏంటని వైఎస్సార్​సీపీ సర్పంచ్‌లు ప్రశ్నించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన తమను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. తమ విధులన్నీ వాలంటీర్లు చేస్తే తాము ఎందుకని ప్రశ్నించారు.

వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక 12 వేల 918 గ్రామాల్లోని 3 కోట్ల 50 లక్షల మంది ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులను తీసుకుని, ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సర్పంచ్‌ల సహాయం లేకుండా జగన్ విజయం సాధిస్తారని అనుకోవడం భ్రమేనన్నారు. వైఎస్సార్​సీపీ ఓటమికే తామంతా పనిచేస్తామని తెలిపారు.

అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సర్పంచ్​లు

"రాజ్యంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారు. సర్పంచులను ఉత్సవ విగ్రహలుగా చేశారు. వాలంటీర్లను తీసుకువచ్చి అన్ని పదవులు వారికే అప్పగించారు. గ్రామంలో అభివృద్ధికి సర్పంచ్​తో ఎలాంటి సంబంధం లేకుండా చేసి సర్పంచ్​ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు."- లెనిన్‌బాబు, సర్పంచ్

చట్ట బద్దత లేని వాలంటీర్ల వ్యవస్థకు సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యతలు అప్పగించడం దారుణమన్నారు. ఏ రాజ్యాంగంలో వాలంటీర్‌ వ్యవస్థ ఉందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్​సీపీకి తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.

పులివెందులనే అభివృద్ధి చేయలేని జగన్‌ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తారు: రాంగోపాల్‌ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details