ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 4 September 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Wed Sep 04 2024- త్వరగా క్లెయిమ్స్ పూర్తి చేయండి - బాధితులకు భరోసా ఇవ్వడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలి: చంద్రబాబు - CM Chandrababu met Bankers

By Andhra Pradesh Live News Desk

Published : Sep 4, 2024, 7:55 AM IST

Updated : Sep 4, 2024, 10:39 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

10:36 PM, 04 Sep 2024 (IST)

త్వరగా క్లెయిమ్స్ పూర్తి చేయండి - బాధితులకు భరోసా ఇవ్వడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలి: చంద్రబాబు - CM Chandrababu met Bankers

CM Chandrababu met Bankers and Insurance Companies: వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు భరోసా ఇవ్వడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో కలెక్టరేట్​లో చంద్రబాబు భేటీ అయ్యారు. బీమా కంపెనీలు 10 రోజుల్లో వాహన, ఇతర బీమాను సెటిల్ చెయ్యాలని సూచించారు. | Read More

ETV Bharat Live Updates

09:14 PM, 04 Sep 2024 (IST)

భారీ వర్షాలు, వరదలతో 32 మంది మృతి - విరాళాలు ఇచ్చేవారికి పన్ను మినహాయింపు - Several People Dead in Floods

Several People Dead in Flood Effects: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 32 మంది మృతి చెందారని ప్రభుత్వం వెల్లడించింది. ఎన్టీఆర్‌ జిల్లాలో 24 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడులో ఒకరు మృతి చెందినట్లు పేర్కొంది. వరదల కారణంగా 2 లక్షలకుపైగా రైతులు నష్టపోయినట్లు వివరించింది. | Read More

ETV Bharat Live Updates

07:54 PM, 04 Sep 2024 (IST)

'ఇన్నాళ్లకు ఊపుకొంటూ వచ్చారా?'- వైఎస్సార్​సీపీ నేతలను నిలదీసిన వరద బాధితులు - Public Fire on YSRCP Leaders

Public Protest Against YSRCP Leaders in Flooded Areas: వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్​సీపీ నేతలకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. ఇళ్లు మునిగిన ఐదురోజుల తర్వాత ఎందుకొచ్చారని బాధితులు నిలదీశారు. బాధితులకు సాయం అందకుండా అడ్డుపడుతున్నారని వైఎస్సార్సీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. | Read More

ETV Bharat Live Updates

06:56 PM, 04 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద ఉద్ధృతి- నీటి విడుదల కొనసాగింపు - PRAKASAM BARRAGE FLOOD

Flood Level Decrease in Prakasam Barrage: భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద క్రమంగా తగ్గుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో జలాశయం అన్ని గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది. | Read More

ETV Bharat Live Updates

06:31 PM, 04 Sep 2024 (IST)

రాష్ట్రంలోని వరద బాధితులకు ఉద్యోగుల భారీ సాయం - రూ.120 కోట్ల విరాళం - APNGO Leaders Announced Donation

APNGO Announced Donation for Flood Victims: వరద బాధితులకు ప్రకటించిన ఏపీ ఎన్జీవో ఐకాస నేతలు భారీ విరాళం ప్రకటించారు. వారి ఒకరోజు వేతనం రూ.120 కోట్ల విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును కలిసి అంగీకారపత్రం అందించారు. | Read More

ETV Bharat Live Updates

05:39 PM, 04 Sep 2024 (IST)

సీఎం చంద్రబాబు యువకుడి కంటే చురుగ్గా పని చేస్తున్నారు: చిన్న జీయర్ స్వామి - Chinna Jeyar Swamy Praised CM CBN

Chinna Jeyar Swamy Comments on CM Chandrababu: సీఎం చంద్రబాబు వరద బాధితులను ఆదుకునేందుకు యువకుడి కంటే బాగా పని చేస్తున్నారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్ స్వామి ప్రశంసించారు. విజయవాడలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ బాధితులకు ధైర్యం చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం వద్ద చిన్న జీయర్ స్వామి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. | Read More

ETV Bharat Live Updates

05:08 PM, 04 Sep 2024 (IST)

విజయవాడ టూ హైదరాబాద్​ ట్రాక్‌ రెడీ- రైళ్ల రాకపోకల పునరుద్ధరణ - Hyderabad Train Services Restarted

Train Services Restarted: భారీ వర్షాలు, వరదలతో రైల్వే ట్రాక్​ దెబ్బతిని విజయవాడ-హైదరాబాద్‌ మధ్య నిలిచిపోయిన రాకపోకలను రైల్వే శాఖ పునరుద్ధరించింది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం సమీపంలో ట్రాక్‌ మరమ్మతులు పూర్తి కావడంతో రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ వెళ్లే రైళ్లను వరంగల్‌ మీదుగా పంపిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

05:02 PM, 04 Sep 2024 (IST)

బ్లేమ్​ గేమ్​ వద్దు- బుడమేరుపై అక్రమాలని తొలగించాలి: వైఎస్​ షర్మిల - Sharmila Visit To Singh Singh Nagar

YS Sharmila Visit To Vijayawada Singh Nagar : విజయవాడ అజిత్‌సింగ్​నగర్‌ మూడు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మంత్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు బాధితులకు సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సింగ్​నగర్​ వాసులను షర్మిల పరామర్శించారు. | Read More

ETV Bharat Live Updates

03:59 PM, 04 Sep 2024 (IST)

బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు- కాలినడకన వెళ్లి పరిశీలించిన మంత్రులు లోకేశ్​, రామానాయుడు - BUDAMERU FLOODS IN NANDIWADA

Heavy Rain Water Floating in Budameru: బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో నీటి ప్రవాహం కొనసాగుతోంది. మూడు చోట్ల గండ్లు పడటంతో అధికారులు పూడ్చే పనుల్లో ఉన్నారు. బుడమేరు గండి పూడ్చే పనులను మంత్రులు నారా లోకేశ్​, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గండ్లు పడిన ప్రాంతానికి వెళ్లే మార్గం లేకపోవడంతో బురదలో మంత్రులు కాలినడకన అక్కడికి చేరుకున్నారు. | Read More

ETV Bharat Live Updates

03:44 PM, 04 Sep 2024 (IST)

విమర్శించే వాళ్లు ముందు సాయం చేసి మాట్లాడాలి - ఇంట్లో కూర్చొని అనడం కాదు: పవన్ కల్యాణ్ - PAWAN KALYAN ON FLOODS

Deputy CM Pawan Kalyan Press Meet on Vijayawada Floods: సీఎం చంద్రబాబు అనుభవం ఏంటో ఈ విపత్తు సమయంలో చూస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. గతంలో హుద్‌హుద్‌ తుపాను సమయంలోనూ చంద్రబాబు ముందుచూపు చూశామని తెలిపారు. వరద బాధితుల కోసం తన వంతుగా రూ.కోటి ప్రకటించానని త్వరలోనే సీఎంకు అందజేస్తానని తెలిపారు. ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా తేలిక కానీ పని చేసేవాళ్లకే ఎంత కష్టమో తెలుస్తుందనిని మండిపడ్డారు. | Read More

ETV Bharat Live Updates

03:25 PM, 04 Sep 2024 (IST)

24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం - పలుచోట్ల భారీ వర్షాలు - Weather Update in AP

Rains in AP: ఇప్పటికే వర్షాలతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతాలు వరద నుంచి కోలుకుంటున్నాయి. మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. | Read More

ETV Bharat Live Updates

02:54 PM, 04 Sep 2024 (IST)

పొలాల్లో స్కూల్​ వ్యాన్​ బోల్తా - స్వల్ప గాయాలతో విద్యార్థులు సేఫ్ - School Bus Over turned

School Bus Overturned in Vizianagaram District : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వరదలు కొంత తగ్గడంతో పిల్లలు బడి బాట పట్టారు. ఈ క్రమంలో 19 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్​ వ్యాన్​ అదుపు తప్పి పొలాల్లో పడిపోయింది. | Read More

ETV Bharat Live Updates

02:15 PM, 04 Sep 2024 (IST)

బ్లాక్ మనీ వైట్ చేసుకునేందుకే జగన్ లండన్ పర్యటన : డోలా - Minister Dola on Jagan london tour

Minister Dola on Jagan London Tour : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే జగన్ విలాసాల కోసం లండన్ పర్యటనకు వెెళ్తున్నారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. సంపాదించుకున్న బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకునేందుకేనా? లండన్ పర్యటన అని ప్రశ్నించారు. లండన్ పర్యటన వెనుక ఉద్దేశం ఏంటో జగన్ రెడ్డి తెలపాలని నిలదీశారు. | Read More

ETV Bharat Live Updates

02:09 PM, 04 Sep 2024 (IST)

"అధిక వడ్డీ, తక్కువ ధరకే వస్తువులు"- రూ.2.5 కోట్ల ఘరానా మోసం - Cheater Arrested on police

Police Arrested Cheater in Satya sai District : సత్యసాయి జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. అధిక వడ్డీలు, తక్కువ ధరలకు సరకులు ఇప్పిస్తానంటూ స్థానికులు ఆశ చూపి ఏకంగా 2.5 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. | Read More

ETV Bharat Live Updates

01:12 PM, 04 Sep 2024 (IST)

వరద బాధితులకు అండగా ప్రభాస్, అల్లు అర్జున్- తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం - Donations To Telugu States

Donations To Telugu States : రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు టాలీవుడ్ కదిలింది. సినీ నటులు ప్రభాస్, అల్లు అర్జున్ తమ వంతుగా విరాళాలను ప్రకటించారు. | Read More

ETV Bharat Live Updates

12:24 PM, 04 Sep 2024 (IST)

వరద నష్టాన్ని ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని లక్షల మంది నష్టపోయారో తెలుసా? - Report on the Damages Caused

Government has Announced the Damage Caused in State : భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది మృతి చెందగా, 1,69,370 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపింది. వరదల వలన 22 సబ్ స్టేషన్​లు దెబ్బతినగా, 3,312 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని వెల్లడించింది. 78 చెరువులకు, కాలువలకు గండ్లు ఏర్పడగా, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6,44,536 మంది నష్టపోయారని ప్రభుత్వం తెలిపింది. | Read More

ETV Bharat Live Updates

12:24 PM, 04 Sep 2024 (IST)

ఆపత్కాలంలో ఆదుకున్న ట్యూబ్‌లు - పంపిణీ చేసిన స్వచ్ఛంద సంస్థలు - Lorry Tubes to Save Lives

Victims Used Lorry Tubes to Save Lives in Flooded Areas : బుడమేరు వరద బాధితులను లారీ ట్యూబ్​లు ఆదుకున్నాయి. ముంపు ప్రాంతవాసులను రక్షించడానికి ప్రభుత్వం బోట్లు ఏర్పాటు చేసినా అవి బాధితులకు సరిపోలేదు. దీంతో చాలా మంది వరద ముంపు బాధితులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ ట్యూబులను వినియోగించుకున్నారు. | Read More

ETV Bharat Live Updates

12:22 PM, 04 Sep 2024 (IST)

పంచదార నెయ్యి, యాలకులు- అన్నవరం ప్రసాదానికి జాతీయ సంస్థ గుర్తింపు - Annavaram Prasadam

Annavaram Prasadam: తిరుపతి లడ్డూ తర్వాత అంతటి రుచి, గుర్తింపు పొందిన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదానికి భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ గుర్తింపు దక్కింది. సత్యదేవుని గోధుమనూక ప్రసాదం తయారీ, నిల్వ చేసే విధానం, ప్యాకింగ్ కు పాటిస్తున్న ప్రమాణాలు, ప్యాకింగ్ సిబ్బంది వ్యక్తిగత శుభ్రత తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. | Read More

ETV Bharat Live Updates

11:15 AM, 04 Sep 2024 (IST)

వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు - ముందస్తు బెయిల్ నిరాకరణ - AP HC on YSRCP Bail Petitions

High Court Denies YSRCP Leaders Bail Petitions : వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురైంది. టీడీపీ ఆఫీస్​పై దాడి కేసులో, చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ ముందస్తు బెయిల్​ను నిరాకరించింది. | Read More

ETV Bharat Live Updates

11:01 AM, 04 Sep 2024 (IST)

వరద బాధితులకు అండగా జస్టిస్‌ ఎన్వీ రమణ - తెలుగు రాష్ట్రాలకు విరాళం - NV Ramana Donates in Telugu States

NV Ramana Donates 10 Lakhs Rupees : రెండు తెలుగు రాష్ట్రాలోని వరద బాధితుల కోసం సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విరాళం ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షల చొప్పున ఆయన విరాళం ఇచ్చారు. | Read More

ETV Bharat Live Updates

10:55 AM, 04 Sep 2024 (IST)

యుద్ధప్రాతిపదికన ట్రాక్‌ల పునరుద్ధరణ - పూర్తికాగానే రైళ్లు పట్టాలెక్కిస్తాం : విజయవాడ డీఆర్‌ఎం - Railway Tracks Restoring

Railway Tracks will Rehabilitation : భారీ వరదలతో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన జరుగుతోందని విజయవాడ డీఆర్ఏం నరేంద్ర ఏ పాటిల్‌ తెలిపారు. ట్రాక్‌ పనులు పూర్తి కాగానే హైదరాబాద్‌-విజయవాడకు రైలు సర్వీసులు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. అలాగే కాజీపేట, మహబూబాబాద్‌ వద్ద ట్రాక్‌ నిర్మాణం పూర్తికాగానే రైళ్లు పట్టాలెక్కిస్తామన్నారు. | Read More

ETV Bharat Live Updates

10:54 AM, 04 Sep 2024 (IST)

తగ్గేదేలే అంటున్న చంద్రబాబు - నడుంలోతు నీళ్లలోనూ నడుస్తూ బాధితులకు భరోసా - Chandrababu Visit Vijayawada

Chandrababu Inspected Vijayawada Flood Areas : హెలికాప్టర్‌లో వెళ్తే వాస్తవాలు తెలియవనే తాను దాదాపు 25 కిలోమీటర్లు జేసీబీపై పర్యటించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వరద వల్ల పాడైన వాహనాలకు బీమా ఇప్పించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు, వ్యాపారాలు నష్టపోయిన వారికి సైతం సాయం అందిస్తామని చెప్పారు. విజయవాడలో మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని వెల్లడించారు. | Read More

ETV Bharat Live Updates

10:25 AM, 04 Sep 2024 (IST)

ఆపత్కాలంలో ఆపన్న హస్తం - నిండు గర్భిణికి సీఎం చేయూత - cbn Help to Pregnant

CM Chandrababu Help to Pregnant in Flood Area in Vijayawada : ఓ వైపు బుడమేరు విజయవాడను అతలాకుతలం చేసింది. కనుచూపు మేర నీరే. విజయవాడ కండ్రిక వాంబే కాలనీకి చెందిన ఓ మహిళ నిండు గర్భిణి. తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలో ఆమె కుటుంబ సభ్యులకు అర్థం కావడం లేదు. అప్పుడే ఆపద్భాంధవుడిలా సీఎం చంద్రబాబు అక్కడికి వచ్చారు. ఆమెను ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. | Read More

ETV Bharat Live Updates

10:21 AM, 04 Sep 2024 (IST)

క్షణం క్షణం ఆందోళన - లంక గ్రామాల్ని ముంచెత్తిన కృష్ణమ్మ - Krishna Floods in Lanka Villages

People Suffer Due to Flood Effect in Joint Guntur District : చుట్టూ వరదనీరు. వాగులను తలపిస్తున్న రహదారులు. ఇళ్లలో నడుములోతు నీటిప్రవాహం. ఎక్కడికక్కడ తడిచిపోయిన తిండిగింజలు. చెల్లాచెదురైన సామగ్రి. కొట్టుకుపోయిన వస్తువులు. కరెంటు సరఫరా లేక చీకట్లోనే జీవనం. అన్నీ వరద పాలవడంతో అధికారులు ఇచ్చే ఆహారపొట్లాల కోసం ఆశగా ఎదురుచూడాల్సిన దుస్థితి ఉమ్మడి గుంటూరు జిల్లాలో నెలకొంది. | Read More

ETV Bharat Live Updates

10:23 AM, 04 Sep 2024 (IST)

శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది - విజయసాయిరెడ్డికి జీవీఎంసీ షాక్‌ - అక్రమ నిర్మాణం నేలమట్టం - GVMC shock for vijaya sai Reddy

శకునం చెప్పే బల్లి తానుపోయి కుడితిలో పడ్డట్లు, అందరికీ నీతులు, శుద్దులు చెప్పే విజయసాయిరెడ్డికి GVMC షాక్‌ ఇచ్చింది. ఎదుటివారిపై నోరు పారేసుకోవడం, ట్విట్స్‌తో బూతులు తిట్టడంలో ఆరితేరిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అక్రమ బాగోతం మరొకటి వెలుగుచూసింది. విశాఖపట్టణం జిల్లా భీమిలి తీరంలో సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఆయన కుమార్తె నేహారెడ్డి నిర్మించిన అక్రమ కట్టడాన్ని అధికారులు నేలమట్టం చేశారు. | Read More

ETV Bharat Live Updates

10:03 AM, 04 Sep 2024 (IST)

వరద బాధితుల సహాయార్థం చిరంజీవి భారీ విరాళం-మానవత్వం చాటుకుంటున్న దాతలు - Chiranjeevi Donate One Crore

Chiranjeevi Donate One Crore Two Telugu States : వరదలు అల్లకల్లోలం సృష్టించిన ప్రాంతాల్లోని బాధితుల ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. మానవత్వం చాటుకుంటూ పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. చిత్ర సీమ నుంచి భారీ విరాలాలు వస్తున్నాయి. విజయవాడ వరద బాధితులకు పలు ప్రాంతాల నుంచి ఆహార పొట్లాలు, తాగునీరు పంపిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

09:38 AM, 04 Sep 2024 (IST)

బుస కొట్టిన బుడమేరు - విజయవాడను ఎందుకు ముంచిందంటే? - Cause of Budameru Floods

Cause of Budameru Floods : బెజవాడను ముంచెత్తిన వరదకు అసలు కారణం భారీ వర్షాలతోపాటు - బుడమేరు ప్రవాహం క్రమబద్ధీకరణ కాకపోవడమే. అందులో నీరంతా కొల్లేరులోకి వెళ్తుంది. ఎన్ని వాగులు, వంకలు పొంగినా - నీటిని తీసుకునే సామర్థ్యం ఉన్న కొల్లేరు సహజ స్వరూపం ఇప్పుడు మారిపోయింది. కొల్లేరు కబ్జాలతో వరద నీరు వేగంగా వెళ్లే పరిస్థితి లేదు. విజయవాడ మీదుగా 150 కిలోమీటర్ల దిగువకు బుడమేరు ప్రవాహం వేగంగా ప్రవహించే అవకాశం లేదు. దిగువకు వరద వెళ్లే పరిస్థితి లేకపోవడానికి గత ప్రభుత్వం పూర్తిగా ఆధునికీకరణ పనులను అటకెక్కించిన నిర్లక్ష్యమే కారణం. 2005-06లో బుడమేరు వరదల తర్వాత దాని ప్రవాహాన్ని పోలవరం కుడి కాలువలోకి మళ్లించారు. కానీ కృష్ణానదిలో వరద ఉంటే అందులోని నీరు నదిలోకి వెళ్లదు. డ్రెయిన్‌ బఫర్‌ జోన్‌ అంతా ఆక్రమణలే కావడం ఇప్పుడు ఇంతటి ఇబ్బంది తెచ్చింది. | Read More

ETV Bharat Live Updates

09:20 AM, 04 Sep 2024 (IST)

గర్భిణులపై ప్రత్యేక దృష్టి - 154 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన వైద్య ఆరోగ్య శాఖ - Special Focus on pregnant women

Health Department Special Focus on Pregnant Women : భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ముంపున‌కు గురైన ప్రాంతాల్లో ఉన్న గర్భిణుల‌పై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. తదుపరి 10 రోజుల్లో ప్రసవించే అవకాశం ఉన్న 154 మంది గర్భిణుల‌ను సురక్షిత ప్రాంతాలకు చేర్చినట్లు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి ఎంటి.కృష్ణబాబు తెలిపారు. అలాగే ప్రజలకు ఆరోగ్య సూచనలు, సలహాలు, సేవలు అందించేందుకు విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాల్ని చేప‌డుతున్నట్లు వెల్లడించారు. | Read More

ETV Bharat Live Updates

09:07 AM, 04 Sep 2024 (IST)

వరదల ప్రభావంతో ఏపీఎస్​ఆర్టీసీకి అపార నష్టం - నీట మునిగిన బస్ డిపోలు, వర్క్ షాప్​లు, గ్యారేజీలు - Floods Effect to APSRTC

APSRTC Suffered Heavy Damage Due to Impact of Floods : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో ప్రభుత్వ రవాణా సంస్థ ఏపీఎస్​ఆర్టీసీకి అపార నష్టం వాటిల్లింది. బస్ డిపోలు, పలు వర్క్ షాప్​లు, గ్యారేజీలు నీటమునిగాయి. పలు బస్సుల్లోకి, ఇంజిన్లలోకి నీరు వెళ్లి ఆగిపోయాయి. పాడైన ఇంజిన్లు మరమ్మతులు చేసేందుకు ఒక్కో బస్సుకు కనీసం రూ.2 లక్షలు ఖర్చవుతాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు పలు ప్రాంతాలకు బస్సులను రద్దు చేయడంతో ఆర్టీసీ ఆదాయం గణనీయంగా తగ్గింది. | Read More

ETV Bharat Live Updates

08:19 AM, 04 Sep 2024 (IST)

వరద ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన - ఆహారం అందుతుందా? లేదా? అని ఆరా - Ministers Visit Flooded Areas

Ministers Visiting Flood Affected Areas in AP : వరద ముంపు ప్రాంతాల్లో రేయింబవళ్లనే తేడా లేకుండా సహాయక చర్యల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు. ప్రజల పరిస్థితులపై ఎప్పటికప్పడు ఆరా తీస్తున్నారు. బాధితులకు ఆహారం, తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates

07:16 AM, 04 Sep 2024 (IST)

బుడమేరు ఎఫెక్ట్ అప్డేట్స్ - ఆపద్బాంధవుల్లా నిలిచిన సహాయక బృందాలు - Budameru Floods

Vijayawada Floods: గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడపై బుడమేరు విరుచుకుపడింది. ఊహకు అందని రీతిలో విధ్వంసం సృష్టించింది. చాలా ప్రాంతాల్లోని ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇలాంటి స్థితిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆపద్బాంధవుల్లా ఆదుకుంటున్నారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
Last Updated : Sep 4, 2024, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details