ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరుద్యోగులారా సిద్ధమా - వచ్చే నెలలో భారీ నోటిఫికేషన్ - AP GOVT MEGA DSC NOTIFICATION 2024

నవంబర్ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు

AP_DSC_NOTIFICATION
AP MEGA DSC NOTIFICATION 2024 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 24, 2024, 7:55 PM IST

AP GOVT MEGA DSC NOTIFICATION 2024: అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. 16 వేల 347 పోస్టులతో కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించింది. నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మాస్టారూ అనే పిలుపు కోసం ఆంధ్రప్రదేశ్​లో కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చుస్తున్నారు. విభజిత ఏపీలో టీడీపీ హయాంలోనే డీఎస్సీలు నిర్వహించారు. 2014 నుంచి 2019 వరకు రెండు డీఎస్సీలను టీడీపీ ప్రభుత్వం నిర్వహించింది. డీఎస్సీ-2014లో 10 వేల 313 పోస్టులను భర్తీ చేశారు. డీఎస్సీ-2019లో 7 వేల 902 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చి, ఎంపిక ప్రక్రియ సైతం చేపట్టారు. కోర్టు కేసుల కారణంగా నియామకాలు పెండింగ్‌లో పడ్డాయి. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత వాటి నియామకాలు పూర్తి చేశారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు

అప్పులు చేసి మరీ శిక్షణ కేంద్రాల్లో కోచింగ్:2019 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని జగన్ హమీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహిస్తుందని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూశారు. జగన్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారని భావించి సామాన్య, మధ్య తరగతి వారు అప్పులు చేసిన శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందారు. కానీ జగన్ సర్కార్ మాత్రం డీఎస్సీ ప్రకటించలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా కంటి తుడుపు చర్యగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం 6 వేల 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. మెగా డీఎస్సీ కోసం ఎదురు చుస్తున్న నిరుద్యోగులు కేవలం 6 వేల 100 పోస్టులు మాత్రమే భర్తీ అని జగన్ సర్కార్ చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడుదల చేసిన పోస్టుల డీఎస్సీనైనా పూర్తి చేసిందా అంటే అదీ లేదు.

నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేలా, తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటించడంతో పాటు మెగా డీఎస్సీకి మొదటి సంతకం పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హమీ ఇచ్చారు. బాధ్యతలు చేపట్టడంతోనే సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీకి మొదటి సంతకం చేశారు. డీఎస్సీ-2024లో 16 వేల 347 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇది కూడా పూర్తయితే టీడీపీ హయాంలో ప్రభుత్వ బడుల్లో 34 వేల 562 పోస్టులను భర్తీ చేసినట్లు అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు డీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తున్న క్రమాన్ని చూసి డీఎస్సీ అభ్యర్దులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నిరుద్యోగుల కోసం ఉచిత మెగా డీఎస్సీ శిక్షణ - ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాసులు - SRINIVASULU START FREE DSC TRAINING

నెరవేరిన నిరుద్యోగుల కల: డిసెంబర్​లోపు ఉపాధ్యాయ నియామకాలన్నీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాత డీఎస్సీని రద్దు చేసిన సీఎం, ఆ స్థానంలో అదనపు పోస్టులతో ప్రకటన జారీ చేయడంతో ఐదేళ్లుగా టీచర్ కొలువు కోసం సిద్ధమవుతోన్న వేలాది మంది నిరుద్యోగుల కల నెరవేర్చారు. ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన చేయడంతో నిరుద్యోగుల డీఎస్సీ శిక్షణ కేంద్రాలకు పొటేత్తారు. డీఎస్సీ శిక్షణ కేంద్రాలు నిరుద్యోగులతో సందడిగా మారాయి. మూడు, నాలుగు నెలల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగించి, ఆ వెంటనే ఎంపికైన వారికి శిక్షణ కార్యక్రమాలను కూడా ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.

మెగా డీఎస్సీ పూర్తయితే రాష్ట్రంలోని 12 సింగిల్‌ టీచర్‌ స్కూళ్లకు అదనంగా ఉపాధ్యాయులు వస్తారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్​లో ఉద్యోగం సంపాదించి తమ కలను సాకారం చేసుకోవాలని నిరుద్యోగులు పట్టుదలతో చదువుతున్నారు. ఉద్యోగ సాధన కోసం అభ్యర్ధులకు కఠోర శ్రమ చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు శిక్షణ కేంద్రానికి వస్తే మళ్లీ రాత్రి 7 గంటల వరకు చదువుతున్నారు. డీఎస్సీ ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు అన్ని పాఠ్యాంశాల్లో శిక్షణ ఇస్తున్నారు.

పోస్టుల వివరాలు ఇవీ: ప్రభుత్వం విడదలు చేసిన మెగా డీఎస్సీలో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371, స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. వీటితో పాటు ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ)-286, వ్యాయామ ఉపాధ్యాయ(పీఈటీ)-132, ప్రిన్సిపాళ్లు 52 పోస్టుల భర్తీ చేయనున్నట్లు ఆదేశాల్లో తెలిపింది. ప్రభుత్వం ప్రకటనపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు చెబుతున్నారు.

6 సంవత్సరాల నుంచి డీఎస్సీ కోసం ఎదురు చుస్తున్నామని, ఉద్యోగాల భర్తీలో న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం చూడాలని నిరుద్యోగులు తెలిపారు. 6 యేళ్ల నుంచి డీఎస్సీ లేకపోవడంతో డీఎస్సీ రాయాలని ఎదురు చుస్తున్న చాలా మందికి వయస్సు సరిపోవడం లేదని, దీని వల్ల వారు నష్టపోయే ప్రమాదం ఉందని, కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. వయో పరిమితి విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని అంటున్నారు.

ఆ జీవో రద్దు కోరుతున్న నిరుద్యోగులు: మరోవైపు పాఠశాల విలీనం పేరుతో గత వైఎస్సార్సీపీ సర్కార్ 117 జీవోను తీసుకు వచ్చింది. దీని వల్ల ఉపాధ్యాయులు పోస్టుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని ఈ 117 జీవోను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు వివిధ దశల్లో ఆందోళనలు చేశాయి. కానీ జగన్ సర్కార్ మాత్రం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే 117 జీవోను రద్దు చేసింది. జీవో రద్దు వల్ల ఉపాధ్యాయుల పోస్టులు అదనంగా పెరిగే అవకాశం ఉందని నిరుద్యోగులు చెబుతున్నారు. డీఎస్సీ కోసం నిరుద్యోగులు శిక్షణ కేంద్రాలకు వరుస కడుతున్న క్రమంలో అధ్యాపకులు వారికి అన్ని సబెక్టులను భోదిస్తున్నారు.

ప్రణాళికబద్దంగా చదివితే తప్పకుండా డీఎస్సీని సాధించే అవకాశం ఉంటుందని, శిక్షణ తీసుకుంటున్న వారు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధ్యాపకులు సూచించారు. గత ఐదేళ్లు డీఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడంతో శిక్షణ తీసుకునేందుకు అభ్యర్థులు వచ్చే వారు కాదని కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుండటంతో డీఎస్సీ సాధించేందుకు అభ్యర్ధులు శిక్షణ కేంద్రానికి వస్తున్నారని అంటున్నారు.
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల - ఈ నెల 9న నియామక పత్రాల అందజేత - DSC Results 2024

ABOUT THE AUTHOR

...view details