Government has Expedited the E Crop Registration Process : రైతులకు ప్రభుత్వపరంగా ఎలాంటి సేవలు, సాయం అందాలన్న ఈ-పంట నమోదు తప్పని సరి. ఇటీవల కురిసిన వర్షాలు, వచ్చిన వరద కారణంగా జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు 3,60,658 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 28,538 ఎకరాల్లో ఉద్యాన పంటలు కలిపి మొత్తం 3,89,197 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇటీవల వరకు పంట నమోదు ప్రక్రియ ఆశించినస్థాయిలో సాగలేదు. ప్రస్తుతం పంటలు దెబ్బతిన్న కారణంగా ప్రభుత్వ ఆదేశాలతో ప్రక్రియను వేగవంతం చేశారు. వ్యవసాయ సహాయకులు, వీఆర్వోలు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఏ రైతుకు ఎంత భూమి ఉంది , ఏయే పంటలు సాగు చేస్తున్నారు, ఇలా అన్ని వివరాలను నమోదు చేస్తున్నారు.
ఎక్కడెక్కడ ఎంతంటే :ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటివరకు పెడన, పెనమలూరు, నందివాడ మండలాల్లో నూరు శాతం పంట నమోదు పూర్తి చేయగా బాపులపాడు, గన్నవరం మండలాల్లో 99 శాతం పూర్తయ్యింది. బందరు సౌత్ 63.4, అవనిగడ్డ 63.9, బందరు నార్త్‌లో 65.1 శాతంతో వెనుకబడి ఉన్నాయి. కోడూరు 88, నాగాయలంక 87, కృత్తివెన్ను 86, పమిడిముక్కల 84.9 మోపిదేవి మండలం 70 శాతంతో ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా 29,846 ఎకరాలు ఈ పంటలో నమోదు చేయాల్సి ఉంది.
పీఎం కిసాన్, పంట నమోదుకు ఈ కేవైసీ తప్పనిసరి- లేదంటే నష్టపోక తప్పదు - PM Kisan E KYC