ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ ప్రజలకు గుడ్​న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి బుకింగ్స్​ - ఎప్పటినుంచంటే!

సూపర్ సిక్స్​లో భాగంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రకటన - 23వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో పథకానికి ఆమోదముద్ర

CM_Chandrababu_on_Free_Gas_Cylinder
CM Chandrababu on Free Gas Cylinder (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2024, 7:48 PM IST

Updated : Oct 21, 2024, 8:53 PM IST

CM Chandrababu on Free Gas Cylinder: సూపర్ సిక్స్​లో తొలి హామీ అయిన ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మహిళలకు దీపావళి కానుకగా ఉచిత సిలెండర్ల పథకాన్ని అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 తేదీ నుంచి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లను ఇచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఏడాదికి రూ.2,684 కోట్ల ఖర్చుతో ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలియచేశారు. మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం దీపం పథకం గొప్ప ముందడుగని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే 5 సంతకాలతో మేనిఫెస్టో హామీలను, అన్న క్యాంటీన్​ల వంటి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లోని పథకాల అమలును మొదలు పెట్టింది. మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. ఈ మేరకు దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ నెల 31 తేదీ నుంచి ఈ పథకాన్ని మొదలు ప్రారంభించనున్నారు. సచివాలయంలో ఈ అంశంపై పౌరసరఫరాల శాఖతో సమీక్షించిన సీఎం, అక్టోబరు 31 తేదీ నుంచి పథకాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని దీపావళి నుంచి సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగమైన దీపం పథకం అమలు గొప్ప ముందడుగు అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం దీపావళి నుంచి ప్రారంభిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్‌

ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ: దీపం పథకంతో ఈ దీపావళి పండుగ ఇళ్లల్లో వెలుగులు తెస్తుందని సీఎం అన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సహా ఇతర అధికారులతో సీఎం దీనిపై సమీక్ష నిర్వహించారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై సీఎం సమీక్ష జరిపారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలు విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 31 తేదీన దీపావళి పథకం ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అర్హులైన మహిళలకు పారదర్శక విధానంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తామని తెలిపారు.

ఈ నెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు: రాష్ట్రంలో ఎల్పీజి గ్యాస్ కనెక్షన్ కలిగి, అర్హతగల ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని వర్తింప చేయాలని అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్దిదారు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈ నెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని, ఈనెల 31వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభింస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు - 20 నుంచి ప్రజల్లోకి వెళ్దాం: సీఎం చంద్రబాబు - CM Chandrababu on Free Gas

రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు: గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్దిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమచేయాలని, ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చామని. ఇప్పుడు మళ్లీ మూడు గ్యాస్ సిలిండర్ల ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందని సీఎం అన్నారు. వంట గ్యాస్ కోసం వెచ్చించే ఖర్చును గృహిణులు ఇతర అవసరాలకు వాడుకోవచ్చని సీఎం అన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచడంలో ఇలాంటి పథకాలు దోహదం చేస్తాయని సీఎం అన్నారు.

అందుకే ఆర్థిక కష్టాలు ఉన్నా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని సీఎం అన్నారు. అర్హులైన లబ్దిదారుడికి పథకం అందలేదన్న విమర్శ రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876 లుగా ఉందని, కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్​కు రూ.25ల సబ్సిడీ ఇస్తోందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ప్రతి సిలిండర్ ధర రూ.851లుగా ఉందన్నారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2 వేల 684 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఐదేళ్లకు రూ.13 వేల 423 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. ఈ నెల 23వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర పడనుంది.

మహిళలకు గుడ్ న్యూస్ - ఉచితంగా మూడు సిలిండర్లు - ప్రతి కుటుంబానికి లబ్ధి! - AP Free Gas Cylinder Scheme

Last Updated : Oct 21, 2024, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details