AP DGP ON TIRUMALA LADDU ISSUE: తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనపై సిట్ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) తెలిపారు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో (Supreme Court) సాగుతున్న దృష్ట్యా, రాష్ట్ర న్యాయవాదుల సూచనల మేరకు దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగానే సిట్ దర్యాప్తు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
కల్తీ నెయ్యి అంశం సుప్రీంకోర్టులో ఉందన్న డీజీపీ, అంతర్గతంగా విచారణ చేశాక ఒక నిర్ణయం వస్తుందన్నారు. సాధారణంగా కేసు తీవ్రతకు అనుగుణంగా సిట్ ఏర్పాటు ఉంటుందని, ఫిర్యాదు ప్రకారం ఏఏ సెక్షన్లు వర్తిస్తాయో దానికి అనుగుణంగా కేసు ఉంటుందని పేర్కొన్నారు. చట్టం, న్యాయస్థానం ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటామని తెలిపారు. కేసు విచారణ పూర్తి పారదర్శకంగా ఉంటుందని, చట్టాన్ని గౌరవిస్తూ, కోర్టుల ఆదేశాల ప్రకారమే తమ పనితీరు ఉంటుందని స్పష్టం చేశారు.
DGP On TTD Brahmotsavam 2024: అదే విధంగా తిరుమల బ్రహ్మోత్సవాల గురించి సైతం డీజీపీ మాట్లాడారు. తిరుమలలో జరగబోయే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు అందుబాటులో ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవని డీజీపీ తెలిపారు. 2 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంటుందని వెల్లడించారు. తిరుమాడ వీధుల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తామన్నారు. అందుబాటులో ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు, తద్వారా 2 వేల 276 ట్రిప్పులు అదనంగా నడుస్తాయని అన్నారు. గరుడసేవ రోజు 2 వేల 714 ట్రిప్పులు నడుస్తాయని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేశారు.
'కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి' - తిరుమల కల్తీ నెయ్యిపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు - SC on Tirumala Laddu Adulteration