CM Chandrababu Review on Roads: రహదారులు భవనాల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణం, రోడ్ల దుస్థితిపై చర్చించారు. రోడ్ల పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జగన్ ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని అధికారులు చెప్పారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వ తీరుతో ఇప్పుడెవరూ ముందుకు రావడం లేదని అధికారులు సీఎంకు వివరించారు. గుంతలు పూడ్చేందుకు తక్షణం 300 కోట్లు అవసరమని ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు. అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని, వాహనదారులు, ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారని అన్నారు. ఈ పరిస్థితిని మార్చేలా పనులు మొదలు కావాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. రాష్ట్రంలో 4 వేల 151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉందని అన్నారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2 వేల 936 కిలోమీటర్లు మేర ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రంలో 7 వేల 87 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
రహదారుల నిర్మాణానికి కేంద్ర సాయం మరింత కోరుదాం: డిప్యూటీ సీఎం పవన్ - Pawan Kalyan on Rural Roads
YSRCP Negligence on Rural Roads: కాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వుం రహదారులను బాగు చేయాల్సిందిపోయి గుంతల్లో పాతరేసింది. రాష్ట్ర వాటా నిధులు ఇవ్వాల్సి వస్తుందన్న భయంతో ఓ పెద్ద సంస్థ అందించిన రుణాన్ని సైతం కుదించింది. ఇలా ప్రాజెక్టు సక్రమంగా సాగకపోవడం వల్ల రెెండు వందల రహదారుల పనులు వెనక్కి మళ్లాయి. ధ్వంసమైన రోడ్లపైనే ప్రజలు ప్రయాణాలు చేస్తూ ఐదు సంవత్సరాలుగా నరకం అనుభవించారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏదైనా పెద్ద ఆర్థిక సంస్థ సాయం అందిస్తే ఏ ప్రభుత్వమైనా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. ఇచ్చిన నిధులను ఉపయోగించుకుని అదనపు రుణం కోసం సైతం ప్రయత్నిస్తుంది. కానీ వైఎస్సార్సీపీ సర్కార్ ఇక్కడ కూడా రివర్స్ విధానాన్నే అమలు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రహదారుల అభివృద్ధికి ఏఐఐబీ (Asian Infrastructure Investment Bank) అందించే 4 వేల 976 కోట్ల రూపాయల రుణాన్ని గత ప్రభుత్వం తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కడ పెట్టాల్సి వస్తుందోనని భయపడి ఆ రుణాన్ని 3 వేల 793 కోట్లకు కుదించేసి గ్రామీణ ప్రజలకు తీరని అన్యాయం చేసింది. ఈ చర్య వల్ల అనేక జిల్లాల్లో ఏఐఐబీ ప్రాజెక్టు కింద మంజూరైన 223 కోట్ల రూపాయల విలువైన రహదారుల పనులు రద్దయ్యాయి.
గ్రామీణ రోడ్లపై జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం - ఏఐఐబీ సంస్థ రుణాన్నీ కుదించిన వైనం - YSRCP GOVT NEGLECT RURAL ROADS