Farmers Worry With Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో రైతులు ఆందోళనకు గురవుతున్నరు.తుఫాను హెచ్చరికలతో చేతికి వచ్చిన పంట నోటికి అందదేమో అని ఆవేదన చెందుతున్నారు. నగరం, రేపల్లె, చెరుకుపల్లి మండలాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఈ తరుణంలో వర్షాలు పడితే పంట పూర్తిగా నష్టాలపాలు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెడిసి కొట్టిన 'వ్యూహం' - అజ్ఞాతంలో ఆర్జీవీ
బంగాళాఖాతంలో వాయుగుండం - రైతుల ఆందోళన (ETV Bharat) ఎకరాకు 20 వేల వరకు పెట్టుబడి:ఎకరాకు 20 వేల వరకు ఖర్చు చేశామని వర్షాలు పడితే పెట్టిన పెట్టుబడులు రావని లబోదిబో అంటున్నారు. కొందరు రైతులు తుఫాను హెచ్చరికలతో భయపడి నూర్పిడి యంత్రాలతో కోత కోసి ధాన్యాన్ని ఇళ్లకు చేర్చుకుంటున్నారు. దీంతో నూర్పిడి యంత్రాలకు డిమాండ్ బాగా పెరగింది. అయితే యంత్రాల యజమానులు మాాత్రం దీనిని అదనుగా తీసుకుని రైతుల వద్ద నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ధాన్యాన్ని వ్యాపారస్తులకు తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
''పంట కోతకు ఇంకా కొద్దిరోజుల సమయం ఉన్నప్పటికీ ఈ తుఫాను హెచ్చరికతో మేమందరం నూర్పిడి యంత్రాలతో ముందుగానే కోయించేస్తున్నాం. ఈ సమయంలో ధాన్యం ధర చాలా తక్కువగా ఉంది. మాకు కనీసం పెట్టుబడైనా వస్తుందా అనేది సందేహంగా ఉంది'' - రైతులు
Mango prices: వ్యాపారులకు కాసులు.. వినియోగదారులకు చుక్కలు