Amigos Minerals Victims in Anantapur Dist :ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో అమిగోస్ మినరల్స్ సంస్థ అక్రమాలు ఒక్కొటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం వసూలు చేయాల్సిన రాయల్టీని, ప్రైవేట్ సంస్థలకు అప్పగించి ప్రకృతి వనరులను దోచుకున్న వైనంపై క్వారీ యజమానులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో మైనింగ్ రాయల్టీ వసూలు కాంట్రాక్టును గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది.
Illegal Mining in AP : ఉమ్మడి అనంతపురం, కడప, చిత్తూరు, శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లాల్లో మైనింగ్ రాయల్టీ వసూలు చేస్తున్న ఈ సంస్థలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో 72 చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఇలా అమిగోస్ మినరల్స్ సంస్థ రూ.1000 కోట్లకు పైగా దోచుకొని ప్రభుత్వానికి ప్రతినెలా చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా ఎగ్గొట్టినట్లు క్వారీల యజమానులు ఆరోపిస్తున్నారు.