Allu Arjun Appeal to his Fans about Negative Posts:సోషల్ మీడియాలో నెగెటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని అభిమానులకు అల్లు అర్జున్ సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు పెట్టవద్దని అభిమానులను అల్లు అర్జున్న కోరారు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ప్రొఫైల్స్‌తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్‌లైన్‌లోనే కాదు ఆఫ్‌లైన్‌లోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అల్లు అర్జున్ కోరారు.
"నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని నా విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ఫేక్ ప్రొఫైల్స్‌తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. నెగిటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని ఫ్యాన్స్‌కు నేను సూచిస్తున్నాను"- అల్లు అర్జున్ ట్వీట్