Aghori Naga Sadhu Hulchul in Mangalagiri Road :గుంటూరు జిల్లా మంగళగిరిలో అఘోరి హల్ చల్ చేశారు. అందిన వారందరిపై త్రిశూలంతో దాడికి పాల్పడారు. 16వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం సుమారు 25 ఏళ్ల అఘోరి పట్టణ శివార్లలో ఉన్న కార్‌వాష్ వద్దకు వచ్చి వాహనాన్ని శుభ్రం చేయాలని కోరారు. ఈలోగా స్థానికులు ఆమెను చూసేందుకు భారీగా వచ్చారు. అంతలోనే అక్కడికి పోలీసులూ చేరుకున్నారు.
అఘోరిని చూసిన స్థానికుల్లో కొందరు ఆమెను సెల్ఫోన్లో వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అఘోరి పలువురిపై ఆమె త్రిశూలంతో దాడికి పాల్పడ్డారు. త్రిశూలంతో కొట్టడంతో నులకపేటకు చెందిన యువకుడు రాజు కాలు విరిగింది. ఆమె జాతీయ రహదారిపైకి ఎక్కి తన వెనక వచ్చే వారి వెంట పడి దాడికి చెయ్యడానికి ప్రయత్నించారు. దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు రోడ్డు డివైడర్‌పై ఉన్న మొక్కలపై పడ్డారు.