ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీ మద్యం కేసులో భారతి రెడ్డి హస్తం- వారం రోజుల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు జంప్: బీజేపీ - Adinarayana Reddy Comments - ADINARAYANA REDDY COMMENTS

Adinarayana Reddy Sensational Comments: జగన్‌ అరాచక పాలనతో నష్టపోయిన ఏపీని తిరిగి గాడిలో పెట్టడమే కూటమి ప్రధాన లక్ష్యమని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. కేంద్రం కూడా రాష్ట్ర పురోభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఓటమి నిరాశలో ఉన్న జగన్‌ అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదని,ఒకవేళ వస్తే మాత్రం సినిమా చూపిస్తామని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.

Adinarayana Reddy
Adinarayana Reddy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 3:45 PM IST

Adinarayana Reddy Sensational Comments: రాష్ట్రంలో వైఎస్ భారతి రెడ్డి రాజ్యాంగం ప్రకారం పాలన కొనసాగిందని మాజీ మంత్రి, జమ్మలమడుగు శాసనసభ్యుడు చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి అన్నారు. దిల్లీ మద్యం కుంభకోణంలో భారతి రెడ్డి ప్రమేయం కూడా త్వరలో బయటకొస్తుందన్నారు. జగన్‌ కేసులపై విచారణ వేగవంతం కానుందని పేర్కొన్నారు. జమ్మలమడుగు నుంచి కూటమి అభ్యర్ధిగా గెలుపొందిన తర్వాత, తొలిసారి విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు.

వైఎస్సార్సీపీ నేతల సంప్రదింపులు: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బీజేపీ బలం పెరిగిందని చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తే ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు గెలుపొందిందని పేర్కొన్నారు. ఆరు ఎంపీ స్థానాలకు మూడు చోట్ల విజయం సాధించారని ఆనందం వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముద్దాయిగా ఉన్నారని, త్వరలో అతనిపైనా చర్యలు ఉంటాయని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. బీజేపీలో చేరేందుకు ఇప్పటికే చాలా మంది వైఎస్సార్సీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. అయితే, రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగించిన వారి విషయంలో బీజేపీ అధిష్ఠానం సైతం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుందని ఆదినారాయణరెడ్డి వెల్లడించారు.
'గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటా'- నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మతో ముఖాముఖి - narasapuram mp interview

వైఎస్సార్సీపీ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది: గత ఐదు సంవత్సరాలుగా వైఎస్సార్సీపీ అక్రమాలతో విసిగిపోయిన ప్రజలు... రాష్టానికి మంచి జరగాలని కూటమికి మద్దతు తెలియచేశారని అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అరాచక పాలనకి ప్రజలు తమ ఓటుతో స్వస్తి పలికారని వెల్లడించారు. పుష్ప సినిమా మాదిరిగా జగన్‌ నేతృత్వంలోనే ఎర్రచందనం స్మగలింగ్ చేయించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చింది మెుదలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. గ్రామీణ ఉపాధిని తుంగలో తొక్కారని ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రజల ఆకాంక్ష అయిన విశాఖ రైల్వే జోన్​కు కాలాలనే స్థలం ఇవ్వలేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలు అభివృద్ధికి అనేక విధాలుగా అవరోధాలు సృష్టంచారన్నారని ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. వారం రోజుల్లోపే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే లు జంపింగ్ కి సిద్ధం అవుతున్నారని ఆదినారాయణరెడ్డి వెల్లడించారు.

'రాక్షస పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి'- శ్రీవారి సేవలో కొత్త ఎమ్మెల్యేలు - New MLAs Visit Tirumala

ABOUT THE AUTHOR

...view details