Actress Meenakshi Chaudhary Visit Kadapa Ameen Peer Dargah:కడప పెద్ద దర్గాను సినీ తారలు దర్శించుకున్నారు. ముందుగా మీనాక్షి చౌదరి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా విశిష్టత గురించి అక్కడి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. లక్కీ భాస్కర్ సినిమా విజయవంతాన్ని అస్వాదిస్తున్నానని ఆమె తెలిపారు. మీనాక్షి చౌదరిని చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. పెద్ద దర్గాను సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. "సంక్రాంతి వస్తున్నాం" సినిమా జనవరిలో వస్తుందన్నారు.
షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన మీనాక్షి: ముందుగా మీనాక్షిచౌదరి కడపలోని ద్వారకానగర్‌లో ఏర్పాటు చేసిన నూతన శుభమస్తు షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. నూతన వస్త్రాలయాన్ని జ్యోతి ప్రజ్యలన చేసి ప్రారంభించిన సినీనటి కొత్తకొత్త చీరలు, వస్త్రాలను పరిశీలించారు. కడపకు మొదటిసారిగా వచ్చినా మంచి స్వాగతం పలికారని ఆమె తెలియ జేశారు. సినీనటిని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. లక్కీభాస్కర్ సినిమా ద్వారా మంచి పేరు వచ్చిందని సంక్రాంతి పండుగకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా మంచి కామిడీతో వస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది మరిన్ని సనిమాలకు సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు.