Prevention Of Cattle Accidents Through Radium Belts:పశువుల వల్ల జరిగే రహదారి ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ వినూత్నంగా ఆలోచించింది. పశువులకు రేడియం బెల్ట్ వేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించే అవకాశముందని ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి బబిత చెప్పారు. గుంటూరు జిల్లా వెంకటపాలెంలో పశువులకు ఆమె రేడియం బెల్ట్ వేశారు.
హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని బబిత తెలిపారు. రాజధాని నుంచి విధులు ముగించుకొని రాత్రి సమయంలో ఇళ్లకు వెళ్లేప్పుడు సీడ్ యాక్సిస్ రహదారిపై పశువుల వల్ల అనేక ప్రమాదాలు జరిగాయని ఆమె పేర్కొన్నారు. వీటిని నివారించడానికి పశువులకు రేడియం బెల్టులు వేయాలని కమిటీ సూచించిందని వెల్లడించారు. వెంకటపాలెంలోని పశువులకు బబిత, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, సీఐలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు రేడియం బెల్టులను వేశారు.