ACB Registered FIR Against Jogi Ramesh Son Rajeev :ఇవాళ ఉదయం 5 గంటల నుంచి మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. 15 మంది ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకుని సోదాలు చేపట్టారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై తనిఖీలు చేశారు. సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించారు. జోగి ఇంట్లో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఏ1గా జోగి రమేశ్ కుమారుడు : జోగి రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఏ1గా జోగి రాజీవ్, ఏ2గా జోగి వెంకటేశ్వరావులను ఎఫ్‌ఐఆర్ చేర్చారు. ఎఫ్‌ఐఆర్‌లో మండల సర్వేయర్ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్య పేర్లు అలాగే నున్న సబ్ రిజిస్ట్రార్ వి.నాగేశ్వరరావును చేర్చారు.సెక్షన్ 120బీ, 420 ఐపీసీ, పీసీ యాక్ట్ 7, 12 సెక్షన్ల కింద, అలాగే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం కేసు నమోదు చేశారు.