ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫార్ములా ఈ-కార్ల రేసింగ్​పై ఏసీబీ విచారణ? - ఏ అంశాలపై దర్యాప్తు జరగనుంది? - FORMULA E RASE CASE

ఫార్ములా-ఈ కార్ల రేసు వ్యవహారంలో ఉల్లంఘనలపై ఏసీబీ విచారణ - దర్యాప్తులో ఏయే అంశాలపై విచారించనున్న ఏసీబీ

ACB Investigation on Formula E Car Race
ACB Investigation on Formula E Car Race (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2024, 9:02 PM IST

ACB Investigation on Formula E Car Race:ఫార్ములా-ఈ కార్ల రేసు వ్యవహారంలో ఉల్లంఘనలు జరిగాయని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించిన వ్యక్తులపై చర్యలకు ఉపక్రమించి విచారణకు ఆదేశించింది. పోటీ నిర్వహణ సంస్థకు ఒకేసారి చెల్లింపులు జరగడం, రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకండా విదేశీ సంస్థకు నిధుల బదిలీ చేయడంపై దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ(Anti Corruption Bureau) ద్వారా విచారణ చేయించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఏసీబీకి లేఖ రాసింది.

హైదరాబాద్​లోని హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కిలోమీటర్ల ట్రాక్​లో 2023 ఫిబ్రవరి 10,11వ తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీకి దేశ వ్యాప్తంగా అభిమానులు హాజరయ్యారు. అది విజయవంతం కావడంతో 2024 ఫిబ్రవరి 10న మరో సారి నిర్వహించాలని భావించారు. అయితే 2023 డిసెంబర్​లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలను పాటించకపోవడంతో తాము హైదరాబాద్ రేస్ నుంచి తప్పుకొంటున్నట్లు అదే నెలలో ఫార్ములా-ఈ ఆపరేషన్స్ ప్రకటించింది. దాంతో అప్పడు ఆ సెషన్ రద్దు అయ్యింది.

ప్రక్రియ త్వరగా జరగాలనే చెల్లింపులు: ఈ పోటీల నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. బోర్డు, ఆర్థికశాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా రూ. 55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ చెల్లింపులు చేయడం ప్రధాన అభియోగం. దీనిపై వివరణ ఇవ్వాలని గతంలో పురపాలకశాఖ బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్​కు సీఎస్ శాంతి కుమారి మెమో జారీ చేశారు. సీఎస్ మెమోకు సమాధానం ఇచ్చిన అర్వింద్ కుమార్ ప్రక్రియ త్వరగా జరగాలన్న ఉద్దేశంతోనే చెల్లింపులు చేశామని పురపాలక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే జరిగిందని వివరణ ఇచ్చారు.

ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ), ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, పురపాలకశాఖ మధ్య 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం కింద లాంగ్-ఫాం ఎల్ఎఫ్ఎ జరిగిందని ఆయన తెలిపారు. 9,10,11,12 సీజన్ల కార్ రేసులు నిర్వహించేలా ఈ ఒప్పందం కుదరిందని తెలిపారు. 9వ సీజన్ కార్ రేస్​ను 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో హైదరాబాద్​లోని నెక్లెస్ రోడ్​లో నిర్వహించారని అప్పటి పురపాలకశాఖ మంత్రి ఆమోదంతోనే ఒప్పందం కుదిరిందని, శాఖాధిపతిగా తాను ఎంఓయూ చేశానని అర్వింద్ కుమార్ పేర్కొన్నారు.

ఏం ఐడియా - 'పుష్ప'ను మించిపోయారుగా​ - కానీ

ఒప్పందానికి ముందే నిధుల చెల్లింపులు: ప్రతి సీజన్​లో పెట్టుబడి పెడతానన్న ప్రమోటర్ తొలి సీజన్​లో తనకు నష్టం వచ్చిందంటూ లేఖలు రాసినట్లు పురపాలకశాఖ పేర్కొంది. 10వ సీజన్​కు వచ్చే సరికి ప్రమోటర్​గా ఉండేందుకు ఏస్ నెక్ట్స్​జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు రాలేదు. ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదు. హైదరాబాద్​లో రేసు నిర్వహించేందుకు ఎఫ్ఈఓ ఆసక్తి చూపిందని, తగిన సమయం లేదనందువల్ల ప్రత్యామ్నాయ ప్రమోటర్​ను ఖరారు చేయడంలో జాప్యం జరుగుతున్నందున పదో సీజన్ నిర్వహణపై ముందుకెళ్లాలని పురపాలక శాఖ మంత్రి సూచించారని వివరించారు. నిధుల చెల్లింపునకు సంబంధించి సెప్టెంబర్ 25న ఎఫ్ఈఓ నుంచి వచ్చిన మెయిల్ ఆధారంగా 2023 సెప్టెంబర్ 27న మంత్రికి ఫైల్​ను సర్క్యులేట్ చేసి హెచ్ఎండీఏను ప్రమోటర్​గా, హోస్ట్ సిటీగా చేర్చామన్న ఆయన తర్వాత ప్రమోటర్​తో ఎఫ్ఈఓ ఒప్పందాన్ని రద్దు చేసుకొందని పేర్కొన్నారు.

దీంతో త్రైపాక్షిక ఒప్పందం కాస్తా ఎఫ్ఈఓ, హెచ్ఎండీఏల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంగా మారినట్లైంది. ఎఫ్ఈఓకు అక్టోబర్ 5వ తేదీన రూ.23 కోట్లు, 11న మరో రూ.23 కోట్లు కలిపి మొత్తం రూ. 46 కోట్లను హెచ్ఎండీఏ నుంచి చెల్లించారు. పన్నుల కింద మరో రూ. 9 కోట్లు కూడా హెచ్ఎండీఏ చెల్లించింది. రేసులో హెచ్ఎండీఏ ప్రమోటర్​గా చేరినా అందుకు బోర్డు ఆమోదం తీసుకోలేదని ప్రభుత్వం గుర్తించింది. ఎఫ్ఈఓ, హెచ్ఎండీఏ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం 2023 అక్టోబర్ 30న కుదిరింది. దాని కంటే ముందే హెచ్ఎండీఏ డబ్బులు చెల్లించింది.

అడ్డుకున్నా ఆగలేదు - వాటిపైకి దూసుకెళ్లిన హైడ్రా బుల్డోజర్లు

నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ:అక్టోబర్ 11న రెండో దఫాగా రూ.23 కోట్లు చెల్లించడానికి ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని, అయినప్పటికీ ఈసీ అనుమతి తీసుకోలేదని ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు రూ.43 కోట్లను పౌండ్లుగా మార్చి ఎఫ్ఈఓకు చెల్లించిందని, ఇలా చెల్లించాలంటే రిజర్వ్ బ్యాంకు అనుమతి అవసరం. ఇలా అనుమతి తీసుకోపోవడం ఉల్లంఘనల కిందకు వస్తుందని ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో పురపాలకశాఖ పేర్కొంది. ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం, నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ అంశంపై విచారణ చేపట్టాలని అవినీతి నిరోధక శాఖకు అక్టోబర్ చివరి వారంలో పురపాలకశాఖ లేఖ రాసింది.

ఇబ్బందులు ఉండకూడదనే నిధుల చెల్లింపులు: హైదరాబాద్, తెలంగాణ ప్రతిష్ట పెంచేందుకు ఫార్ములా-ఈ రేసును తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేశామని అప్పటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తదుపరి సెషన్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే తాము నిధుల చెల్లింపుపై నిర్ణయం తీసుకున్నామని మీడియాకు తెలిపారు. పురపాలక శాఖ మంత్రిగా, హెచ్ఎండీఏ వైస్ ఛైర్మన్​గా తాను అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్​గా ఉన్న అర్వింద్ కుమార్​కు ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. హెచ్ఎండీఏకు ఛైర్మన్​గా ఉన్న అప్పటి సీఎం కేసీఆర్ అనుమతి కూడా ఉందని తెలిపారు. ఇందులో ఎలాంటి తప్పు లేదని త్రైపాక్షిక ఒప్పందంలోని సంస్థ తప్పుకోవడంతో రేసు నిర్వహణ కోసం నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని, ఎక్కడా దుర్వినియోగం జరగలేదని కేటీఆర్ వివరించారు.

విచారణకు అనుమతి ఇస్తూ నిర్ణయం: విచారణ కోరుతూ ఏసీబీకి లేఖ వచ్చినప్పటికీ బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలంటే వారి స్థాయిని బట్టి ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీంతో అప్పటి పురపాలకశాఖ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్​పై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోసం గవర్నర్​కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అప్పటి పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్​పై కేసు నమోదుకు ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఏసీబీకి సీఎస్ లేఖ రాశారు. అప్పటి చీఫ్ ఇంజనీర్​పై కేసు నమోదు చేసి, విచారణ జరిపేందుకు కూడా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అంగీకారం తెలిపారు. ప్రభుత్వ లేఖపై మొదట న్యాయ సలహా కోరిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తాజాగా కేటీఆర్​పై విచారణకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సీఎస్​ విచారణ జరపాలని ఏసీబీకి లేఖ రాయడంతో అధికారులు గురువారం కేసు నమోదు చేశారు.

స్టేషన్​లోనే మందేసి పోలీసులకు చుక్కలు చూపించాడు - చివరికి ఏమైందంటే!

సోషల్ మీడియాలో మహిళలను వేధిస్తే 5 సంవత్సరాల వరకు జైలు

ABOUT THE AUTHOR

...view details