ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబుకు ముద్దు పెట్టబోయిన మహిళ- అడ్డుకున్న సెక్యూరిటీ

చంద్రబాబుకు ముద్దుపెట్టడానికి పలుమార్లు ప్రయత్నించిన మహిళ - సున్నితంగా తిరస్కరించి, ముందుకు సాగిన సీఎం

A Woman Tried to Kiss the CM Chandrababu in Anakapalli District
A Woman Tried to Kiss the CM Chandrababu in Anakapalli District (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2024, 2:53 PM IST

Updated : Nov 3, 2024, 5:29 PM IST

A Woman Tried to Kiss the CM Chandrababu in Anakapalli District :అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబుకు ఓ అనూహ్య సంఘటన ఎదురైంది. జిల్లాలో శనివారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ మహిళ ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. అదే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం వీడియో కెమెరాకు చిక్కింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. జిల్లా పర్యటన ముగించుకుని సభావేదిక నుంచి కాన్వాయ్ బస్ ఎక్కడానికి వెళ్తున్న క్రమంలో పరవాడకు చెందిన ఒక మహిళ అభిమానంతో తొలుత సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం చంద్రబాబుకు ముద్దుపెట్టడానికి పలుమార్లు ప్రయత్నించగా ఆయన సున్నితంగా తిరస్కరించి, ముందుకు సాగారు.

భద్రతా వలయాన్ని తప్పించుకుని సీఎం వద్దకు : అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జడ్ ప్లస్ భద్రతలో ఉండే చంద్రబాబు దగ్గరకు వెళ్లడమంటే మామూలు విషయం కాదు. కానీ ఓ మహిళా అభిమాని మాత్రం ఎలాగైనా తమ అభిమాన నేత చంద్రబాబును కలవాలనుకుని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో అనకాపల్లి పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని తప్పించుకుని సీఎం వద్దకు వెళ్లారు. ఆమె అభిమానాన్ని చూసి చంద్రబాబు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సీఎం భద్రతా సిబ్బంది మహిళను వారించే ప్రయత్నం చేసినా, చంద్రబాబు మాత్రం ఆ మహిళను దగ్గరకు తీసుకుని అప్యాయంగా పలకరించారు. ఆమె తమ అభిమాన నేత చంద్రబాబుకు పుష్ఫగుచ్చాన్ని అందించింది. అయితే ఆమె అక్కడితే ఆగలేదు. చంద్రబాబును పట్టుకుని ఆయనకు ముద్దు పెట్టే ప్రయత్నం చేసింది. అయితే ఆయన సున్నితంగా తిరస్కరించి, ముందుకు సాగారు.

సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు - ఏపీ భవిష్యత్ మార్చేలా కొత్త ప్రణాళిక

సంక్రాంతి నాటికి గుంతల్లేని రోడ్లు : అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం వెన్నెలపాలెంలో రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ, "రోడ్లు నాగరికతకు చిహ్నం. అలాంటి రోడ్లను గత పాలకులు నరకానికి దారులుగా మార్చారు. వారు మిగిల్చిన ఈ విధ్వంసాన్ని పూడ్చే బాధ్యతను మేం తీసుకున్నాం. సంక్రాంతి నాటికి గుంతల్లేని రోడ్లుగా అభివృద్ధి చేసి తీరతాం. సంపద సృష్టించాలంటే రహదారుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు ముఖ్యం. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో రూ.1.25 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులు నిర్మించబోతున్నాం. అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు, కుప్పం- బెంగళూరు రోడ్డు, భోగాపురం, మూలపేట వంటి ప్రధాన రోడ్లు ఉన్నాయి. వాటిలో రూ.76 వేల కోట్ల పనులు వచ్చే రెండున్నరేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం." అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

ఈ దుస్థితికి గత పాలకుడే కారణం - రోడ్లపై గుంతలు లేకుండా చేస్తాం: సీఎం చంద్రబాబు

ప్రజలను మోసం చేసేందుకే రుషికొండ నిర్మాణాలు - ఈ దుర్మార్గం అందరూ చూడాలి: సీఎం చంద్రబాబు

Last Updated : Nov 3, 2024, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details