ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

పోలీసులు అదుపులో వర్రా రవీందర్‌రెడ్డి - రహస్యంగా విచారణ

చంద్రబాబు, పవన్, లోకేశ్, అనితపై అసభ్యకర పోస్టులు -వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తని అదుపులోకి తీసుకున్న పోలీసులు

YSRCP Social Media Activist Varra Ravindra Reddy Under Police Custody
YSRCP Social Media Activist Varra Ravindra Reddy Under Police Custody (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

YSRCP Social Media Activist Varra Ravindra Reddy Under Police Custody :వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా సామాజిక మాధ్యమాల్లో ప్రతిపక్షాలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కూడా వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న రవీందర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనితలపై పలు సందర్భాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు.

జగన్​ను విమర్శిస్తే అది ఎవరైనా సరే : వైఎస్సార్సీపీ హయాంలో జగన్​ను విమర్శించిన ప్రతిసారి చంద్రబాబు, లోకేశ్​పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి, పైశాచిక ఆనందం పొందేవారు. అంతటితో ఆగకుండా వివేక హత్య కేసులో జగన్ పైన అవినాష్ రెడ్డి పైన ఎన్నికల సమయంలో తీవ్రమైన విమర్శలు చేసిన సునీత, షర్మిలపైన కూడా రవీందర్ రెడ్డి అసభ్య కరమైన రీతిలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. జగనన్న ఆదేశిస్తే దేనికైనా సిద్ధమే అన్న విధంగా పోస్టులు పెట్టారు. 'అవసరమైతే సునీతను కూడా లేపేయండి' అన్న అంటూ రాయలేని భాషలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. విజయమ్మపైనా అసభ్యకర పోస్టులకు వెనకాడలేదు. రవీందర్ రెడ్డి పోస్టులపై మనస్థాపానికి గురైన వివేకా కుమార్తె సునీత, సైబరాబాద్​లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. షర్మిల కూడా హైదరాబాద్​లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

పులివెందులలో వర్రా ప్రత్యక్షం- దర్జాగా జగన్​ క్యాంప్​ ఆఫీస్​లోనే - YSRCP Social Media Activist Varra

రహస్యంగా విచారణ : ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనూ సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, అనితకు వ్యతిరేకంగా అత్యంత హేయమైన రీతిలో రవీందర్ రెడ్డి పోస్టులు పెడుతుండగా పులివెందుల, మంగళగిరి, హైదరాబాద్​లో పలు కేసులు నమోదు అయ్యాయి. ఫలితంగా మంగళవారం సాయంత్రం పులివెందులలో రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కడపకు తీసుకొచ్చి రహస్యంగా విచారిస్తున్నారు.

ANUSHA: "తెదేపా మహిళలపై... అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు"

'నేనింతే - నా తీరింతే - అసెంబ్లీకి రానంతే' - Jagan on Speaker Election Process

ABOUT THE AUTHOR

...view details