ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

టీడీపీ, జనసేన కూటమిలో జోష్‌- అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో నేతల సంబరాలు - TDP leaders Celebrations

TDP-Janasena Assembly Candidates Celebrations: టీడీపీ- జనసేన కూటమి తరపున పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల కాగానే నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. సీటు కేటాయించిన అధినేతలకు ధన్యవాదాలు చెబుతూ, గెలుపును బహుమతిగా ఇస్తామని ఉత్సాహంగా ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు.

tdp_janasena
tdp_janasena

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 8:14 PM IST

Updated : Feb 25, 2024, 10:08 PM IST

TDP-Janasena Assembly Candidates Celebrations:అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా తెలుగుదేశం- జనసేన కూటమిలో జోష్‌ నింపింది. టిక్కెట్లు దక్కినవారు, వారి అనుచురులు సంబరాల్లో మునిగిపోయారు. సీటు కేటాయించిన అధినేతలకు ధన్యవాదాలు చెబుతూ, గెలుపును బహుమతిగా ఇస్తామని ఉత్సాహంగా చెబుతున్నారు. ఇదే ఊపులో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి.

TDP- Janasena alliance:తెలుగుదేశం, జనసేన కూటమి తొలి జాబితా రావడంతో శ్రేణులు సందడి చేస్తున్నాయి. మంగళగిరిలో పలువురు కార్యకర్తలు వైసీపీని వీడి లోకే‌శ్ సమక్షంలో సైకిలెక్కారు. ఓడినచోటే గెలవాలనే పట్టుదలతో మళ్లీ మంగళగిరి నుంచి పోటీ చస్తున్నట్లు నారా లోకేశ్ (Nara Lokesh)​ తెలిపారు.

ఈ పన్నుల ముఖ్యమంత్రి ఒక చేత్తో వంద రూపాయలు ఇచ్చి, మరో చేత్తో వెయ్యి రూపాయలు లాగేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణ (Arimilli Radha Krishna) "సకల జనుల చైతన్య యాత్ర - రేపటి కోసం పాదయాత్ర" 6వ రోజూ కొనసాగింది. తణుకు సీటు ఆరిమిల్లికి కేటాయించడంతో కార్యకర్తలు, ప్రజలు అభినందనల్లో ముంచెత్తారు.

అభ్యర్థుల పని తీరు బాగోకుంటే మార్చేందుకు ఎంత మాత్రం వెనకాడను: చంద్రబాబు

అనకాపల్లి సీటు దక్కిన జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ (Konathala Rama Krishna) రాజుపాలెంలోని సూర్యనారాయణమూర్తి, అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అందరినీ కలుపుకొని ఎన్నికల్లో విజయం సాధిస్తానని కొణతాల ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వైసీపీకి చెందిన 400 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రాష్ట్ర అభివృద్ధికోసమే మా ప్రయత్నం - మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి: బాబు, పవన్

సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలకు తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించడంపై తిరుపతి జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ హర్షం వ్యక్తంచేశారు. నాయుడుపేట ఇన్‌ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం (Nelavala Subrahmanyam) నివాసంలో సమావేశం ఏర్పాటుచేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పులివెందుల సీటు దక్కించుకున్న బీటెక్‌ రవి (B.Tech Ravi.) మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిని కలిసి తెలుగుదేశంలోకి రావాలని ఆహ్వానించారు. తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవిరెడ్డికి కడప అసెంబ్లీ సీటు ప్రకటించడంతో అనుచరులు సంబరాలు చేసుకున్నారు. ఈ జోష్‌లో 32, 33, 34, 35 డివిజన్ల పార్టీ కార్యాలయాలను శ్రీనివాసరెడ్డి, మాధవిరెడ్డి కలిసి ప్రారంభించారు.

టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

NRIs Rally in Australia:తెలుగుదేశం తొలి జాబితా రావడంతో విదేశాల్లోనూ పార్టీ సానుభూతిపరులు సంబరాలు చేసుకున్నారు. మెల్‌బోర్న్‌లో ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసీపీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. చంద్రబాబు నేతృత్వంలోనే రాష్ట్రానికి తిరిగి పూర్వవైభవం వస్తుందని ఆకాంక్షించారు.

టీడీపీ-జనసేన కూటమిలో జోష్‌ - అభ్యర్థల తొలి జాబితా ప్రకటనతో నేతల సంబరాలు
Last Updated : Feb 25, 2024, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details