Nude calls controversy is the reason: ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల రహస్య కెమెరాల వివాదానికి ప్రధాన కారణమని నిపుణులు, పోలీసులు నిర్దారణకు వచ్చారు. కళాశాలకు చెందిన ఒక విద్యార్ధి అమ్మాయిని వలలో వేసుకుని ఆమెతో మాట్లాడిన న్యూడ్ కాల్‌ను రికార్డు చేశారు. ఆ రికార్డు చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి, విద్యార్ధిని, ప్రియుడితో హోటల్ గదికి వెళ్ళిన మరో విద్యార్ధిని, ఆమెకు వన్‌సైడ్ ప్రేమికుడు ఇంకొకరు, చెల్లిని మోసం చేసిన స్నేహితుడి అంతు చూడాలనుకున్న ఇంకో విద్యార్థి. ఇలా మొత్తం ఐదుగురు విద్యార్ధుల మధ్య సాగిన అంతర్గత వివాదమే కేంద్రబిందువుగా తేల్చారు. ఫైనల్‌గా ఒక అమ్మాయి హిడెన్ కెమెరాలతో వసతి గదులు, స్నానపు గదుల్లో విద్యార్థినుల నగ్న వీడియోలు రికార్డు చేసి అబ్బాయిలకు విక్రయిస్తున్నట్లు పుట్టించిన వార్తల్లో నిజం లేదన్న నిర్ణారణకు అటు పోలీసులు, ఇటు సాంకేతిక విచారణ బృందాలు వచ్చాయి.
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల' హిడెన్ కెమెరాల' గుట్టు
ఈ వ్యవహారాన్ని చంద్రబాబు, లోకేశ్ సీరియస్‌గా తీసుకుని ముగ్గురు ఐజీలు జీవీజీ అశోక్‌కుమార్ , పీహెచ్‌డీ రామకృష్ణ, ఎం. రవిప్రకాశ్‌తో కూడిన బృందాన్ని రంగంలోకి దించారు. వారు కళాశాల నెట్‌వర్క్ సిస్టం, కంప్యూటర్‌లలో ఉన్న డేటా మొత్తం సేకరించారు. కళాశాల, వసతి గృహాల్లో ఏవైనా రహస్య కెమెరాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగించారా లేదా అన్న విషయంపైనా విశ్లేషణ నిర్వహించారు. ఈ విశ్లేషణల్లో ఫైనల్‌గా ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నా వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఇలా తేల్చారు
మరోవైపు దేశంలోనే ప్రతిష్టాత్మక టెక్నికల్ సంస్థ సెర్ట్ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) డైరెక్టర్ సంజయ్ బాహ్ల్ నేరుగా కళశాల వ్యవహారంపై విచారణ చేశారు. పుణె సీ-డాక్ నిపుణుల బృందం కాలేజీకి చేరుకుని విద్యార్థి సంఘాల నేతలు, కళాశాల సిబ్బంది సమక్షంలో హాస్టల్ స్నానాల గదుల్లోని ఎలక్టికల్, ప్లంబింగ్ పరికరాలన్నీ ఎలక్ర్టానిక్ డిటెక్టర్లతో పరిశీలించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థుల సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, మరో ఇద్దరు అబ్బాయిల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, హాస్టల్‌లోని వై-ఫై రూటర్లను సెర్ట్ విశ్లేషణ చేస్తోంది. ఎక్కడ రహస్య కెమెరా పెట్టినా వై-ఫై ద్వారా నెట్ వాడి వాటిని బయటికి ట్రాన్స్‌మిట్ చేయాలి. ఒకవేళ మొబైల్ ఫోన్ల హాట్‌స్పాట్ తీసుకున్నా ఎవరెవరు హాట్‌స్పాట్ ఎవరికి ఇచ్చారనేది కూడా తేల్చేపనిలో సెర్ట్, సీ-డాక్ బృందం నిమగ్నమైంది. కాగా, ఇప్పటి వరకూ జరిగిన ప్రచారంలో నిజాల్లేవని నిపుణులు, పోలీసులు నిర్ధారణకు వచ్చారు.