New MLA Candidates in TDP List:తెలుగుదేశం ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో 24 మంది తొలిసారిగా అసెంబ్లీకి పోటీచేయనున్నారు. ఈ జాబితాలో యువత, మహిళలు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 51 మంది గ్రాడ్యుయేట్స్ తమ జాబితాలో ఉన్నారని పేర్కొన్నారు. ఇరు పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉన్న సీట్లపై మరింత కసరత్తు కొనసాగుతోందని చంద్రబాబు తెలిపారు.
టీడీపీ- జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల
TDP JanaSena candidates:టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్దుల జాబితా విడుదలైంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇరు పార్టీల అధినేతలు సమావేశమై అభ్యర్దుల పేర్లను ప్రకటించారు. ఈ జాబితాలో అసెంబ్లీకి పోటీ చేసే వారిలో టీడీపీ నుంచి 94 పేర్లను ప్రకటించారు. జనసేన పోటీచేసే 5 స్థానాల అభ్యర్దులను ప్రకటించారు. బీజేపీ పొత్తు కలసి వస్తే, మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికోసమే మా ప్రయత్నం - మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి: బాబు, పవన్
Candidates Details:తెలుగుదేశం తరుఫున తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు
1. తొయ్యక జగదీశ్వరి - కురుపాం
2. విజయ్ బోనెల - పార్వతీపురం
3. కొండపల్లి శ్రీనివాస్ - గజపతినగరం
4. యనమల దివ్య - తుని
5. మహాసేన రాజేష్ - పి.గన్నవరం
6. ఆదిరెడ్డి వాసు - రాజమండ్రి సిటీ
7. బడేటి రాధాకృష్ణ - ఏలూరు
8. సొంగ రోషన్ - చింతలపూడి
9. కొలికళాపూడి శ్రీనివాస్ - తిరువూరు
10. వెనిగండ్ల రాము - గుడివాడ
11. వర్ల కుమార్ రాజా - పామర్రు
12. వేగేశ్న నరేంద్ర వర్మ - బాపట్ల
13. గూడూరి ఎరిక్షన్ బాబు - ఎర్రగొండపాలెం
14. కావ్యా కృష్ణ రెడ్డి - కావలి
15. నెలవల విజయశ్రీ - సూళ్లూరుపేట
16. కాకర్ల సురేష్ - ఉదయగిరి
17. మాధవీరెడ్డి - కడప
18. బొగ్గుల దస్తగిరి - కోడుమూరు
19. అమిరినేని సురేంద్ర బాబు - కల్యాణ దుర్గం
20. ఎం. ఈ సునీల్ కుమార్ - మడకశిర
21. సవిత - పెనుగొండ
22. జయచంద్ర రెడ్డి - తంబల్లపల్లి
23. వీఎం థామస్ - జీడీ నెల్లూరు
24. గురజాల జగన్మోహన్ - చిత్తురు
2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు వీరే
Chandrababu on First List:జగన్ వల్ల రాష్ట్రం దెబ్బతిందని చంద్రబాబు మండిపడ్డారు. అభ్యర్థుల పేర్లు ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడారు. వైసీపీ అరాచకాలను సామాన్యులు మొదలకుని తానూ, పవన్ కల్యాణ్ ఇద్దరమూ భరించామని వ్యాఖ్యానించారు. విద్వేషాలకు అతీతంగా టీడీపీ- జనసేన కలిసి రాష్ట్రాన్ని కాపాడాలనేదే తమ ప్రయత్నమని చంద్రబాబు తెలిపారు. విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభమైందని, అదే తీరు చివరిదాకా సాగిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జాబితా కోసం తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశామని, 1.10 కోట్ల మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. అన్ని కోణాల్లో విశ్లేషించి అభ్యర్థుల వడపోత చేశామని తెలిపారు.