MP Kalishetty Presented Handloom Cloths to PM Modi:జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఓ అపురూప కానుకను అందజేశారు. ప్రధానిగా హ్యాట్రిక్ విజయం సాధించిన మోదీ చిత్రాన్ని ఓ చేనేత కుటుంబానికి చెందిన దంపతులతో ప్రత్యేకంగా నేయించారు. ఈ కానుకను ప్రధానికి ఎంపీ అప్పలనాయుడు స్వయంగా అందజేశారు. ఎంపీ అప్పలనాయుడు సూచన మేరకు ఈ చిత్రాన్ని విజయనగరంలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం లావేరు మండలానికి చెందిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులు సుమారు 40 రోజుల పాటు శ్రమించి ఈ వస్త్రాన్ని పూర్తి చేశారు.
మూడు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల పొడవు కలిగిన చేనేత వస్త్రంపై మోదీ చిత్రాన్ని ఆ దంపతులు తీర్చిదిద్దారు. బుధవారం స్వయంగా ఎంపీ అప్పలనాయుడు ప్రధాని మోదీకి ఈ చిత్రపటాన్ని అందజేయగా ఆయన చాలా సంతోషం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం రోజున ఈ కానుక అందుకోవడం ఓ తీయని జ్ఞాపకంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 40 రోజులపాటు శ్రమించి ఈ వస్త్రాన్ని రూపొందించిన బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులను ప్రధాని మోదీ అభినందించారని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. అంతేకాకుండా పీవీజీ రాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని కూడా మోదీకి అందజేసినట్లు ఎంపీ అప్పలనాయుడు తెలిపారు.
పదే పదే చెప్తున్నా అలా చేయొద్దు! - మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన - CM Guidance to Ministers