MLA Somireddy Chandramohan Reddy Fires on Jagan :దేశాన్ని, మతాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చిన జగన్‌కు మతి చలించిందని టీటీడీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ ఇప్పుడు దేశాన్ని, మతాల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇదేం దేశం అంటావా? అని దుయ్యబట్టారు. అయితే సౌది అరేబియా లేదా దుబాయ్‌కో వెళ్లిపో అని హితవు పలికారు. తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం చేస్తే భారతి ఇంట్లోని రానివ్వదని జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. లేకపోతే క్రైస్తవ ఓట్లు పోతాయని తిరుమల పర్యటన రద్దు చేసుకున్నావా అని నిలదీశారు.
దేశాన్ని, మతాన్ని, తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు జగన్‌కు ఉందా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. జగన్ తన కన్నతల్లి, చెల్లినీ దూరం చేసుకున్నాడని విమర్శించారు. అసలు జగన్ పరిస్థితి, ఆయన పార్టీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి పుంగనూరుకు, మిథున్ రెడ్డి రాజంపేటకు వెళ్లలేని పరిస్థితి అని పేర్కొన్నారు. కొడాలినాని, వంశీ, రోజాలు నియోజకవర్గాలకు కాదు కదా కనీసం వారి జిల్లాలకు పోలేకపోతున్నారని విమర్శించారు. సజ్జల, ధనుంజయ్ రెడ్డిలది అయితే అజ్ఞాతవాసమేనని ఎద్దేవా చేశారు.